ఆత్మవిమర్శ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నువ్వు కవిత్వం రాస్తున్నావా?
కవిత్వం అంటే ఏంటో ముందు నీకు తెలుసా?
నీ కవిత్వంతో సమాజానికి మెసేజ్ ఇచ్చేస్తావా?
నువ్వు చెప్పిన మాటలు విని మనుషులు మారిపోతారా?
అసలు నువ్వు రాసేది కవిత్వమేనా? అంటూ
నా ప్రతిబింబం నాకెదురవ్వగానే నా బుజ్జి బ్రెయిన్ మొదట 
వేసే బోలెడు ప్రశ్నలు ఇవే...
అంతేనా!!!
నేను ఎవరికి ఎదురైనా నాకు ఎదురయ్యే ప్రశ్నలు ఎన్నో ఎన్నెన్నో...
కవిత్వమా???
అరే అంత ఖాళీగా వున్నావా ఏంటి???
ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా???
ఇప్పుడెవరు చదువుతున్నారు అసలు కవిత్వం???
అసలు నువ్వు ఈ జనరేషనేనా???
ఇలా కలత కలిగించే ప్రశ్నలు నన్ను పలకరించిన ప్రతిసారీ 
నా ఆత్మవిశ్వాసాన్ని అడుగంటనివ్వక 
ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటూనే ఉంటా...
నా మనసుని కాగితంలా పరచి, భావాలను అక్షరాలుగా మలచి
కాలం వెంట కలం పట్టి పరుగులు తీస్తూనే వుంటా...
ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటునే వుంటా...


కామెంట్‌లు