ఓటు;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అవినీతిగా మారుతున్న సమాజంలో మార్పునుతేగలదు....
అణిచివేతకు గురి అవుతున్న ప్రజల గళాన్ని గట్టిగా వినిపించగలదు....
భ్రష్టుపట్టిపోతున్న వ్యవస్థలను సరైన దారిన నడిపించగలదు....
పతనమై పోతున్న ప్రభుత్వ పనితీరును హక్కుగా ప్రశ్నించగలదు....
కరెన్సీ నోట్లకు 
కొమ్ము కాస్తున్న 
నాయకులను గద్దెదించగలదు....
రాక్షసులై ప్రజలను 
హింసిస్తున్న రాజకీయ పార్టీలను వణికించగలదు....
దేశ భవిష్యత్తుపై నేతలు రాసిన గీతలను చేరిపేయగలదు....
అభివృద్ధి పథంగా నడిపే నూతన విధానలు కలిగిన వ్యవస్థను నిర్మించగలదు.....


కామెంట్‌లు