కవి సమ్మేళనం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆప్యాయంగా అన్నా చెల్లీ అంటూ పిలిచే పదముల వైపు పాదాలు సాగగా…
నమస్కారం అంటూ ఇన్నాళ్లు సంస్కారాన్ని
చూపిన చేతులు మనమంతా ఒక్కటన్న భావంతో కరచాలనం కోరగా…
మాటల తూటాలన్నీ సున్నితమైన పూల 
రెక్కలై ప్రతి ఒక్కరి మదిని తాకగా...
చెప్పలేక మూగబోయిన భావాలన్నీ హాయిని కోరుతూ 
ఆ అంబరం దిశగా పరుగులు తీయగా...
ఊహలన్నీ కొత్త ఒరవడితో అందరి మది లయల్లో ఊగిసలాడగా...
నలుదిక్కులు చూసి వస్తామంటూ అందమైన వేడుక సెలవును కోరగా…
కలాలన్నీ కాలానికి అడ్డు వేస్తూ సాగనీయక ఆపగా...
చుక్కలన్నీ అచ్చమైన తెలుగు అక్షరాలై అక్షింతలు చల్లగా...
మన తెలుగు మురిసింది చూసి కనులారా ఈ చిరునవ్వుల వేదిక
మనదంతా ఒకే కుటుంబం అన్న తీరుగా...కామెంట్‌లు