కష్టజీవి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 మనసును తనువును ఏకం
చేసి నిష్ఠనియమాలతో, ఏకాగ్రతతో,
నిస్వార్ధంగా, 
ఆది నుంచి 
తుది వరకు తనలో తాను
లీలమై కార్యసిద్ధి మాత్రమే 
తన ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ… 
తన గమ్యమే లక్ష్యంగా 
ముందుకు సాగుతూ 
సూటిగా వెను తిరగని 
సమయం తీరుగా,
ఆటుపోటులను చూడక, 
రేయీ పగలను లెక్క చేయక 
తన పనిని తాను దైవంగా భావిస్తూ  
తన యొక్క కష్టాన్ని 
మానసావాచాకర్మణా ఇష్టపడే 
ప్రతి కష్టజీవి -ఇష్టజీవితో సమానమే...
కామెంట్‌లు