నేటి సమాజం ;- జక్కల శివ ఇంటర్మీడియట్-చరవాణి :7093225602
 నిజాయితీ చూడలేము
 నిజం వినలేము 
 సాంప్రదాయాలు కనలేము
 నిజమైన ప్రేమను స్పృశించలేము 


 నిజాయితీపరులుగా బ్రతుకలేము 
 న్యాయమార్గాన నడవలేము 
 అరాచకాల అణచలేము 
 అక్రమాల అడ్డగించలేము

 డబ్బుకే గౌరవం
 డబ్బే  సర్వస్వం 

 డబ్బు అన్నీ చేయగలదని వీరి పిచ్చి నమ్మకం
 డబ్బు ఆకలిని పెంచలేదని వీరికి తెలియదు
 డబ్బు ప్రేమను పంచలేదని వీరికి తెలియదు 
 డబ్బు ఆత్మీయులను అందించలేదని తెలియదు

********


కామెంట్‌లు