గుర్తుకొస్తున్నాయి-- ఈ నేనేనా ఆ నేను;-- సత్యవాణి కుంటముక్కుల 8639660566
 'ఈనేనేనా ఆ నేను' అని  ఈనాళ్ళలో నాకనపిస్తూవుంటుంది.
    నేలమీద నడిచేదాన్నా నేనసలు!పరులుతీయడమేకానీ,"దూకడం,గెంతడం తప్ప నాడెంగా నడవలేవా పిల్లా భూమ్మీద?ఆడపిల్లవుకావా?"అంటూ మా అమ్మ ఎప్పుడూ అననేలేదు కానీ,మా చిన్నదొడ్డమ్మ పులుగుర్త లక్ష్మినరసమ్మ  రామచంద్రపురంనుంచి మాఇంటికి చుట్టంచూపుగావచ్చినా, రోజూ మందలించడం మానేదిదకాదు. పైగా "ఈ వాణికి కుదురులేదు.అసలు ఆడపిల్ల లక్షణమే లేదు." అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.
   'వయసు కులుకా-బాతుకులుకా' ఇప్పుడలాగే వుంటుందిలే"అనేది కూడా. 
  మనచెవులకు అవేమీ వినబడేవేకాదు ఆ దౌడ్ తీయడంలో.
      మా మేడమీదకెళ్ళడానికి పధ్ధెనిమిది మెట్లుండేవి. రెండు ,మూడు మెట్లొదిలేసి  నాలుగో మెట్టుమీదకు దూకేదాన్ని.పరుగులు దూకుళ్ళతో ఆ పధ్ధెనిమిది మెట్లూ రోజుకీ ,ఎన్నిసార్లు ఎక్కి దిగెదాన్నో లెక్కపెట్టలేదెప్పుడూ.
     అమ్మ "పెరట్లోకెళ్ళి కరివేపాకు తెేవే"అన్నప్పుడేకాదు,మా వీధివైపుకు రాని పెళ్ళి పల్లకీలు, రామకోవెల ఎదురుగావుండే, పంచదార చిలకల బాయమ్మ ఇంటెదురుగా ఆగి నప్పుడు, ఆ ముత్యాల పల్లకీని చూడడంనాకు మురిపెం కనుక, చకచకా కరివేపాకు చెట్టెక్కి,కళ్ళారా చూసేసేదాన్ని.
     చెట్లెక్కడం ఎలావచ్చింది నీకు అని అడగకండి.'సీతమ్మవాకిట్లొ'సినీమాలో సీత పాత్రధారి అంజలి చెప్పినట్లు 'అదేమిటో అలావచ్చేసిందిచెట్లెక్కడంనాకు.'
    మా మేడమెట్లేకాదు, మా 'హంసవరం' బంగారం అత్తయ్య కొడుకు నరసింమూర్తి బావ ఒడుగు అన్నవరం కొండమీద జరిగింది. క్రింద సత్రంలో సామాన్లకోసం గదితీసుకొన్నారు.తీరా ఒడుగు సీరియస్సుగా జరుగుతుంటే,అత్యవసరమైనవి ఏవో  ఆనవాయితీగా మరచిపోవడం జరిగినప్పుడు,వాళ్ళు నన్నుతెమ్మని చెప్పినా,చెప్పకపోయినా, చిటెకెలేస్తూ ,చెంగుచెంగున లేడిపిల్లలా గెంతులేస్తూ ,'శ్రీవారికి ప్రేమలేఖ' సినీమాలో హాస్యనటుడు 'మిశ్రో '  చెప్పినట్లు,'అన్నవరంకొండ,తెలుసుకదా బాబూ! ఎంతెత్తువుంటుందో.' అంతెత్తు కొండమెట్లూ అవలీలగా గెంతుతూ దిగడమేకాదు, పిసరంత ఆయాసంకానీ ,అలసట కానీ లేకుండా ఆ ఒడుగు రోజు ఎన్నిసార్లు దిగిఎక్కేనో ఇప్పుడు తలచుకొంటే  ఆనేనేనా ఈనేను అని ఆశ్చర్యపోతుంటాను.
    మొన్నామధ్య ఏదో పంక్షన్ కి అన్నవరం కొండపైకి వెళ్ళినప్పుడు,గుడిలోకెళ్ళడానికి ఎక్కవలసిన ఆ నాలుగైదు మెట్లు ఎక్కవలసివచ్చినప్పుడు,ఎంతఆపససోపాలు పడ్డానో కదా!అలాంటప్పుడే
 ఈనేను-ఆనేనేనా అని అనుకొంటుంటాను. 
     అంతేకాదు,పావు ఎకరం స్థలంవున్న మా పెరడును నేనూ ,నాచెల్లి చిన్నపాపా కలసి, రాయా-రప్పాలేకుండా  శుభ్రంచేసి,కనకాంబరం మొక్కలు,చిట్టిచేమంతి మొక్కలు ,మల్లె పాదుల తో నందన వనంలా చేసి, పూలను పూయించి,ఆపూలను అందమైన బారెడు బారెడు దండలుగా కట్టి ,మా ఊరి గుడిలోని ఆసామి రామలింగడి భార్య ఉమాదేవికి హారాలుగా సమర్పించేవారం ప్రతీరోజూ.ఆ మొక్కలకి రోజూ నీరు పోయనవసరం లేదని మా అమ్మచెపుతున్నా, చేతులు బొబ్బలెక్కేలా నూతిలోనీళ్ళు చెేదిపోసేవాళ్ళం.
     అలా నేను ఒళ్ళువంచి పనిచేస్తున్నప్పుడు చూసినవాళ్ళు,"అబ్బో!వాణి మగరాయడులా గంతులేయడమేకాదు, అవసరమైతే పనిచేస్తుందన్నమాట"అంటూ పొగిడితే మరింతపని చేసేసేదాన్నినేను.పొగిడితే పొంగిపోనివాళ్ళెవరుంటారు.
      ఇకపోతే,మా రౌతులపూడిలో వెేసవికాలం చ్చిందని ఎలా తెలిసేదంటే, ప్రతిఏడూ,ఏదోఒక పేటలోని, తాటాకు కొంపలు అంటుకొని, తగులబడిపోవడం వలన తెలిసేది..ఏదోఒకటి రెండిళ్ళు తగలబడటంకాదు,చుట్టుపక్కల ఇళ్ళన్నీ చుట్టబెట్టేసేవాడు అగ్గిరాముడు..
    అదిగో అలా ఇళ్ళంటుకొన్న సమయంలో,తమ తమ ఇంళ్ళంటుకొన్నవాళ్ళతోపాటుగా, తమ ఇళ్ళేక్కడ అంటుకొంటాయో అనే భయంతో కొందరు ముందుజాగ్రత్తగా ,పాపం అలోపొలో మంటూ ఏడుస్తూ,దగ్గరగా వున్న నూతుల్లోంచి నీళ్ళు మూకుమ్మడిగా తోడుకొని అగ్గగ్గలాడుతూ పట్టికెళ్ళి అగ్గి ఆర్పుకొనేవారు.  అప్పటికీ ,ఇప్పటికీ మా రౌతులపూడి  మండలకేంద్రమైనా,  అగ్నిమాపక గంటలకారుకి స్టేషన్ వచ్చినట్లులేదు. నామొహం ఇప్పటికీ రాలేదంటే, అరవై,డభ్భైఏళ్ళక్రితం దానిమాటే మాఊరివాళ్ళం విననేలేదు.సరే,అక్కడెక్కడో  ఇల్లంటుకొందంటే, ఇక్కడిక్కడి అన్నివీధులవాళ్ళూ, వాళ్ళ  తాటాకిళ్ళను ముందుజాగ్రత్తగా,బోల్డునీళ్ళు తోడి,తాటాకు పైకప్పులు తడుపుకొని,తమఇళ్ళకు మటలు వ్యాపించకుండా ముదుజాగ్రత్త పడేవారు.  ఎందుకంటే ఎంతదూరంనుంచైనా నిప్పు రవ్వ ఎగిరివచ్చి ఎవరింటిమీద పడుతుందో తెలియదుకదామరి .!                                   మాఊరిమొత్తానికి ,అప్పట్లో పదుల సంఖ్యలోనే పక్కా ఇళ్ళుండేవి.
     అవతల  వెలమల వీధుల్లో పెద్దనుయ్యిలున్నున్నాయో,ఉంటే ఎన్నివున్నాయో నాకు తెలియదుగానీ, మా పెరట్లో సీతారామయ్య తాతగారికీ ,మాకూ ఉన్న ఉమ్మడి నుయ్యకి మధ్యలో, పెద్ద రేకు అడ్డంగావుండే ,పే....ద్ద నుయ్యవుండేది.మా నుయ్యే కాకుండా,మా వీధిలో లక్ష్మింపతి మావయ్యగారినుయ్యి, మా పక్కిల్లు, సత్యంమావయ్యగారి పెరట్లో నుయ్యీ,గోటేటారి ఇంటికి ఎదురుగావుండే దివిలి కంసాలాళ్ళ నుయ్యీ చాలా పెద్దనూతులు.వేసవికాలం అంటే వాటికీ లెఖ్ఖేలేనట్లు ,నిండుకుండల్లా నీటితో నిండివుండేవి.ఎక్కడ నిప్పంటుకొన్నా,ఈ నూతులు కావలసినంత నీటిని అందించేవి. ఈనాడు ఆనూతులేవీలేవు.మా పెరట్లో పాచిపట్టిన నీటితో వున్న మా ఉమ్మడి నుయ్యితప్ప.'నుయ్యీ,నుయ్యీ ఎందుకు పాచిపట్టిపోయావ్ ?అంటే,
ఇంటింటింకీ పంచాయితీ కుళాయిలొచ్చేస్తే, పాచిపట్టక చస్తానా!' అన్నట్లుందది. ఆరోజులలో మా ఇంటికే కాకుండా,ఊరందరి అవసరాలూ తీర్చిన మా నుయ్యని, కళ్ళతో చూసేవారులేక, దిక్కులేని దీనురాలిలా పాచిపట్టిన నీటితో అలా పడివుందది.
      ఆరోజుల్లోచాలారోజులవరకూ మాకు పెరటివెైపున వున్న రజకుల పేటవాళ్ళకీ,వెలమపేట వాళ్ళకీ రోజువారీ వాడుకలకి కూడా మానుయ్యే ఆధారం.వాళ్ళంతా వచ్చి ,నీలాటిరేవుదగ్గర,ఊసులాడుకొంటునట్లు ,మానూతిదగ్గర,  ఊరు ముచ్చట్లు చెప్పుకొంటుంటే ,లోకల్ పేపర్ చదివినట్లు, ఊర్లోవిషేషాలు తాజా తాజాగా తెలిసిపోయేవి మాకు. 
    మామూలుగా మాకు పెరటివైపుకు దగ్గరగావుండే మాలపేటవాళ్ళకు, దినవారీ అవసరాలకు వాడుకోవడానికి వాళ్ళనూతులు  ఎక్కడున్నాయో తెలియదుగానీ, ఇలా అగ్నిప్రమాద సమయాల్లో మటుకు,
 వాళ్ళకి కూడా మా నూతినీళ్ళు అక్షయపాత్రలా ఎంతతోడినా,ఎంతమంది తోడినా తరిగిపోనన్ని నీళ్ళతో  ఆదుకొనేది మానుయ్య.
     అయితే అలాంటి ఆపద సమయాల్లో అగ్నిమాపక సిబ్బందిలాగే, మా ఇంట్లోవాళ్ళమంతా,మా పైడమ్మ తెచ్చిచ్చే తాటాకు చేదలు, తాళ్ళు మొత్తంగా బయటకు తీసి,గాబుల్లోకీ గంగాళాల్లోకీ తోడిపోస్తూవుంటే,వాళ్ళు అంటే ,ఆ బాధితులు అంచలంచలుగా నిలబడి ,హడావిడిపడుతూ,అలోమని ఆక్రోసిస్తూ నీళ్ళుపట్టికెళ్ళి మండే కొంపలు తడుపుకొనేవారు. 
     ఇంతకీ అలాంటి సమయాల్లో,అంత పెద్ద,లోతైన నుయ్యినుంచి, అమ్మా ,పిన్నిలతోపాటు, , ఉత్తిసమయాల్లో నూతిలో చేదకూడావెయ్యని, వేయనవసరంలేని నేను ,ఎన్ని నీళ్ళుతోడి,ఎన్నిసార్లు గాబులూ,గంగాళాలూ ,ఎంత వేగంగా నింపేదాన్నో ఇప్పుడు తలచుకొంటుంటే  ఆనేనేనా ఈనెేను అని నాకపిస్తుంటుంది..
     ఆతర్వాత తర్వాత,  ఆదర్శభావాలుకల మా అమ్మ ,అన్ని కులాలవాళ్ళనూ నూతినీళ్ళు స్వయంగా తోడుకోవచ్చు అనిచెప్పింది. దాంతో  మాకు నీళ్ళు తోడిపోసే వత్తిడి చాలామటుకు తగ్గింది.అలాగే మా నియోజకవర్గానికి చెందిన ముద్రగడపద్మనాభంగారు ,చాలామందికి పక్కాఇళ్ళు కట్టించిపెట్టేరు.దాంతో అగ్గిరాముడు మాఊరు రావడంమానేసాడు.
        ఇక సంవత్సరానికి ఒక్కరోజు నాగులచవితినాడు ,పుట్టలో పాలుపోయడానికి, మా పాలికాపులు ,మరిడయ్యో,దొంగబ్బాయో, అప్పన్నో ఎవరో ఒకరు రెండెడ్ల బండితెస్తే, అదెక్కి,బండిలోనే,మడిగా మముడుచుకొని కూర్చొన్న  అమ్మనీ,పిన్నీతోపాటు మడిగట్టుకు కూర్చున్న చిమ్మిలీ ,చలిమిడీ వగైరా పుాజ సామాన్లు ముట్టుకోకుండా మా 'లోబీడు' పొలంచేరుకున్నాకా,అక్కడ చెంగు చెంగున ఎగిరే మా ఆవుదూడలతోపాటు,మా పిల్లలందరం పరుగులు తీస్తుంటే, "పాపగారూ!చూసుకోండి,ముళ్ళూ,పాములూ వుంటాయి "అని హెచ్చరించేవాళ్ళు మా పాలేర్లు. వాళ్ళు పుట్ట చెక్కి శుభ్రపరచినతరువాత అమ్మ పుట్టలోపాలు పోసుకోడానికి రమ్మనిపిలిచే వరకూ పొలమంతా దున్నేసేవాళ్ళం.      
    ఇప్పుడితంతా ఎందుకు చెపుతున్నానంటే,మామూలు సమయాల్లో అటుపుల్ల ఇటుపెట్టని నేను, అవసరమైతే ఆనాటి రోజుల్లో నా చురుకుతనం మీతో చెప్పటానికిమాత్రమేసుమా! 
    అలాంటి ఆనేను అంత హుషారుగా వుండే ఆనెేను ,మాకాకినాడింట్లో,అదే ,నాఇంట్లో నూతిలో చాదేవెయ్యను. ఒకవేళ ఓపిక తెచ్చుకొని ఎలాగోలా సరదాగా వేద్దామన్నా,ఒకప్పుడు చెంబుతో ముంచితే అందే మానూతిలో నీళ్ళు, ఇప్పుడు నూతిఅడుగునెక్కడో ,ఆనాటి సినీనటి 'కన్నాంబ' కంటిలో నీరులా కనీ కడపడకుండా,కాసిన్ని నీళ్ళచుక్కలుండి, బకెట్టుమునగనేమునగదు.
     ఒకప్పుడు అంతవేగంగా,మా మేడమెట్లే కాకుండా, అన్నవరం మెట్లన్నీ అన్నిసార్లు ఎక్కిదిగిన ఆనేను,    ఇప్పుడు మా మేడమెట్లేక్కడంమాటసరే,బయటనుండి ఇంట్లోకెళ్ళడానికి ,మా గడపముందుండే రెండుమెట్లక్కలేక అవస్థపడుతున్నానంటే ,ఆనేనేనా ఈనేను  అని అనుకోకుండా ఎలావుంటాను? 'వయసుకులుకా --బాతుకులుకా' అని ఆనాడు మాచిన్నదొడ్డమ్మ చెప్పిన సామెత ఈనాడు పదే పదేగుర్తుకొస్తూవుంటుంది.  ''
     వయసు వంకరలు తీరుస్తుందో లేదో తెలియదుకానీ,వయసు వార్థక్యాన్ని తెచ్చి అంటగట్టి మనలను ఆటపట్టిస్తుంది.పాత జ్ఞాపకాలను నెమరువేయిస్తుంటుంది.
      

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం