మారిన మనిషి;-వి.నందిని, 9వ తరగతి 'ఈ 'సెక్షన్సెల్:9959906527

 అనగనగా ఒక ఉరిలో చిన్న కుటుంబం ఉండేది. అందులో అమ్మ నాన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవారు. బాబు పేరు రమేష్ అమ్మాయి పేరు నిత్య. వాళ్ళ నాన్న మంచి వాడు కాదు. ఎందుకంటే ఎప్పుడూ నిత్య అనే అమ్మాయిని మంచిగా చూసుకునేవాడు కాదు. ఎప్పుడూ తిడుతుండేవాడు. కొడుతుండేవాడు. అలాగే రమేష్ ని కూడా తిడుతుండేవాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఇద్దరినీ ఒకేలా చూసేది. అమ్మకు చాలా ఇష్టం వీళ్ళంటే. నిత్య ఏదైనా అడగగానే చేసేది రమేష్ కి కూడా. ఏది కాదు అని అనేది కాదు. వాళ్ళ అమ్మ చాలా కష్టపడి రమేష్ ఇంకా నిత్య ని చదువుపిస్తుంది వాళ్ల నాన్న మాత్రం ఏది పట్టించుకునే వాడు కాదు. అన్ని వాళ్ళ అమ్మే చూసుకునేది. రమేష్ నిత్యా చాలా బాధపడేవారు. ఎందుకంటే వాళ్ల నాన్న కోసం. నిత్య రమేష్ కి వాళ్ళ అమ్మానాన్నలతో ఉండటం చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్న కుదరనిచ్చేవాడు కాదు.  వాళ్ళ నాన్న అంటే కానీ వాళ్ళ నాన్నకి మాత్రం అస్సలు నచ్చదు.  నిత్య కూడా వాళ్ళ అమ్మానాన్నల పరిస్థితి చూసి అడిగేది. ఏదైనా రమేష్ కూడా ఎక్కువగా అడిగేవాడు కాదు. ఒకరోజు రాత్రి సమయం చాలా ఎక్కువగా గడిచింది. ఇంకా రావడం లేదు. వాళ్ళ నాన్న ఇక నిత్య రమేష్ చాలా భయంతో ఉన్నారు చాలాసేపటి తర్వాత వాళ్ల నాన్న వస్తాడు. బాగా తాగి వాళ్ల పైకి అరుస్తాడు నిత్య రమేష్ వాళ్ళ అమ్మను చాలా కొడతాడు.  నిత్య త్వరగా వెళ్లి ఇద్దరినీ ఆపుతుంది ఒకరోజు వాళ్ళ నాన్న బాగా తాగి ఇంటికి వెళ్లేటప్పుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. వెంటనే అక్కడున్న ప్రజలు వాళ్ల భార్యకి ఫోన్ చేస్తారు. వాళ్ల భార్య త్వరగా వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది అక్కడున్న డాక్టర్లు లివర్ చెడిపోయింది అని అంటారు. అప్పుడు వాళ్ళ నాన్న కోసం నిత్య ఇంకా రమేష్ గుడిలో అడుక్కుంటూ వాళ్ళ నాన్న బ్రతకాలని పూజలు మరియు అడుక్కోవడం చేస్తారు. వాళ్ల నాన్న ప్రాణాన్ని బ్రతికిస్తారు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజులకి తనకి వాళ్ళ భార్య జరిగిన కథ మొత్తం చెబుతుంది. ఇదంతా తెలిసిన నాన్నకి అప్పుడు నిత్యని ఇంకా రమేష్ ని క్షమాపణ అడుగుతాడు. ఇకనుంచి నేను మారిన మనిషిని అని చెబితే అందరూ సంతోషపడతారు.
కామెంట్‌లు