పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 సమస్యాపూరణలు
*విక్ర పరాక్రముండు విలపిచెనుబిక్కున తక్షణంబునన్*
ఉ.
అక్రమమింతలేక వినయంబున సాగెడి రాజసంబుకున్
సక్రమ దారిలోతరలె సద్గణవంతుల బుద్ధినేల యీ
చక్రము దిప్పువారమని సాంతము దూర్తులు వెంబడించ యా
*విక్ర పరాక్రముండు విలపించెను బిక్కున తక్షణంబునన్*
సమస్యాపూరణం
*మూర్ఖుడు మోక్షంబునొందె మోహము చేతన్*
క.
ధార్ఖానై హింసించెడి
మూర్ఖత్వపు గుణము మార్చ మురిపెము జూపన్
జార్ఖండున స్త్రీ నటనకు
*మూర్ఖుడు మోక్షంబునొందె మోహము చేతన్*

కామెంట్‌లు