రామాయణంలో సంఘటన;-మమత ఐల--కరీంనగర్--9247593432
 క.
రావణుని వధించి పిదప
పావనితో రాఘవుండు భవనముకేగన్
దైవముగ నయోధ్య జనులు
పూవులతో స్వాగతించె పురుషోత్తమునిన్
క.
సీతమ్మను గొనియాడిరి
బ్రాతకు పెన్నిధిగ నిలచి వనములకేగన్
నీతికి లక్ష్మణుడనుచును
జ్యోతులతో హారతులిడి శుభమనిరంతన్

కామెంట్‌లు