దత్తపదులు;-మమత ఐలకరీంనగర్9247593432
 విలువ,వలువ,తలపు,వలఫు
చ.
*విలువ* లు ప్రేమతత్వమున విద్యల తోడను సంత‌రించవా
*వలువ* లు దానమియ్యగను వచ్చిన పుణ్యము శక్తి బెంచునే
*తలపు* న మంచి లోచనలు దారిని జూపులె చిక్కుముళ్ళలో
*వలపు* లు కళ్ళు గమ్మినను వంతెన బుద్ధిని నిద్రలేపుమా 

దత్తపది:- ఈగ..దోమ..నల్లి..పేను..రామాయణార్థంలో
ఉ.
*ఈగ* ల వోలె రక్కసులు యెప్పటికప్పుడు మూగియున్నగన్ 
రాగలడిట్లు *దోమ* వలె రావణ లంకకు వాయు పుత్రుడే
దాగుడు మూతలాడుచును తల్లిని జూసెను *నల్లి* వోలెనే
వేగిరమందు *పేను* వలె వెంటనె కాల్చెను లంకనంతయున్

కామెంట్‌లు