ఆచార్యపాకాలయశోదారెడ్డి 93 వ జయంతి-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--సిద్ధిపేట--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
అచ్చమైనతెలంగాణముచ్చటలను
తనదుకథలలోచొప్పించితన్మయమున
చిక్కనైనట్టిపదరాశిమిక్కిలిగను
మనకునందించె"యెచ్చమ్మ"మాన్యురాలు!!!

02.
తే.గీ.
సుమధురమయినమనభాషసొంపులెన్నొ
మాటమాటలోపలికించిమీటిమదిని
మమతసమతానురాగాలువిమలముగను
అందజేసె"యెచ్చమ్మ"యెసుందరముగ!!!

03.
తే.గీ.
మనతెలంగాణయాసలోమాటలాడి
బ్రతుకువెతలనువివరించిపాటవముగ
తెలుగుభాషకుతనబాధ్యతలనుజేసి
నిలిచెముదముగా"యెచ్చమ్మ"విలువతోడ!!!


కామెంట్‌లు