అత్యాశకు గుణపాఠం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 పీరయ్యకు ఆశ ఎక్కువ అనే దానికంటే అత్యాశ ఎక్కువ అంటే మేలు.ఎప్పుడు చూసినా ఎక్కడ ఏదైనా ఉచితంగా వస్తుందా,తను చేసే పనివలన లేక ఇచ్చిన అప్పుకి అధిక వడ్డీ వస్తుందా అని ఆలోచిస్తూనే ఉంటాడు.
          ఒకరోజు పనిపడి పక్క ఊరికి కాలి నడకన బయలు దేరాడు ఆ ఊరు దగ్గరే కనుక. అలా పోతూ ఉంటే పీరయ్యకు ఒక పెద్ద పండ్లచెట్టు కనబడింది. అంతే ఆ పండ్లు దండిగా కోసుకుని తీసుక వెళితే ఇక పండ్లు కొనాల్సిన అవసరం రాదు అదిగాక తన కుటుంబం మాత్రమే పుష్టిగా తినవచ్చునని తలపోస్తూ మెల్లగా చెట్టు ఎక్కాడు.అలా కొమ్మలు పట్టుకుని ఎక్కడం వలన తన వేలికున్న ఉంగరం జారి ఆ చెట్టు తొర్రలో పడిపోయింది! తొర్ర చాలా లోతుగా ఉంది,చెయ్యి పెడితే అందలేదు!
    "పండ్లకోసం ఆలోచిస్తుంటే ఉన్న ఉంగరం పోయిందే" అని అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకున్నాడు పీరయ్య.
       చిత్రంగా తన ఉంగరం వంటిదే మరొక ఉంగరం ఆ చెట్టు తొర్రలో నుండి ఎగిరి పీరయ్య వడిలో పడ్డాయి.అది చూసి పీరయ్య బోలెడు ఆశ్చర్యపోయాడు.
       అప్పుడే పీరయ్య మెదడులో ఒక ఆలోచన వచ్చింది.ఒక ఉంగరం పడిపోతే రెండు ఉంగరాలు వచ్చాయి మరి రెండు పండ్లు వేస్తే నాలుగు వస్తాయేమో చూద్దాం అనుకుంటూ కోసిన రెండు పండ్లు వేశాడు,వెంటనే కన్నంలోంచి నాలుగు పండ్లు వచ్చాయి!పీరయ్య ఆశ్చార్యానికి అంతులేదు!
      ఇక పీరయ్యకు ఆశ ముంచుకొచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న  ఓ డబ్బు మూట వేసాడు.మరలా రెండు మూటలు కన్నం లోంచి వచ్చి పడ్డాయి.ఇక పీరయ్య అత్యాశ పరాకాష్టకు చేరుకుంది.ఇక ఆగలేక ఆ రెండు డబ్బు మూటలు, పండ్లు, చేతికున్న ఉంగరాలు,మెడకున్న బంగారు గొలుసు ఆ కన్నంలో వేసాడు.
        అంతే ఎంత సేపు చూసినా ఏవీ రాలేదు! మరింత సేపు వేచి చూసాడు.కన్నంలోకి మొహం పెట్టి గట్టిగా ఏడుస్తూ అరిచాడు.
        లోపలనుండి పెద్దగా నవ్వు వినిపించింది!
     "ఏరా పీరయ్యా నీ ఆశకు అంతులేదు, నీవు ఇక్కడకు రాగానే నీ విషయాలు నాకు తెలిసాయి.నీ లాగే నేను అత్యాసతో అతిగా ఆశించడం వలన ఈ రాక్షస జన్మ పొందాను.న్యాయ మైన ఆశ  ఉండొచ్చుగానీ అత్యాశ పనికి రాదు ఎంత సంపాదించినా కొంత  మంచి పనులకు ఉపయోగించాలి,నీవు అదికూడా చేయలేదు.ఇకనైనా మారు,అది నీకు మీకు మేలు చేస్తుంది"చెప్పాడు తొర్రలోని రాక్షసుడు.
       "ఇక నేను నీ మాట ప్రకారం  నేను నడచుకుంటాను అదిగాక నాచేతనైనంత అవసరం ఉన్న వారికి సహాయం చేస్తాను"అని చేతులు జోడించి చెప్పాడు.
       వెంటనే ఆ కన్నంలోంచి తన వస్తువులు,రెండు పండ్లు మాత్రం కన్నం నుండి వచ్చాయి.
       "బ్రతుకు జీవుడా" అనుకుంటూ  పీరయ్య  తన డబ్బు సంచి,బంగారం ,పండ్లు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పోయాడు.
                   ****************

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం