మూడువందల జీవాలు(అనువాద కవిత )-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

 గడ్డకట్టే ఆచలిలో ఆచెరువులో
నీరు కదులుతోందా?
అక్కడ ఉన్న గొర్రలు,మేకలు చలి
కాచుకునేందుకు ఒకటికి ఒకటి
హాయిగా హత్తుకుంటున్నాయి!
అది గొర్రె సంవత్సరమా?
మేక సంవత్సరమా?
మేధావులు చర్చించుకుంటున్నారు!
ప్రతి విషయం బుర్రకు పదునే కదా!
గొర్రెలను,మేకలను ఒకటిగా
హత్తుకునేట్లు చేయాలి చలినుండి
రక్షణ పొందేందుకు---చిన్న వాటిని
పెద్ద వాటిమధ్యకు తోలాలి.
చిక్కటి చలితో మరో రాత్రి 
ముంచుక వస్తున్నది!
"ఈ పరిస్థితులు నీమనస్సును
కలవర పరచడం లేదా?"అడిగాను 
నా నెచ్చెలిని.
"ఎందుకు కలవరం?
ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో
వాటికి తెలిసినంతగా మనకు
తెలియదు-----అవి తెలివి గల జీవాలు!"చెప్పింది.
చలిలో అది ఒక వెచ్చటి మాట నాకు!
(నయోమీ షిహాబ్ న్యె కవితకు అనువాదం)
         *****   ******   ******

కామెంట్‌లు