చిన్నితల్లి;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
బాల పంచపదులు
==============

1.చెల్లి మాఇంటి సిరిమల్లి!
   నడయాడే పున్నమి జాబిలి!
   మురిపాల నిజపాలవెల్లి!
   దేవుడిచ్చిన కల్పవల్లి!
  చెల్లి,అచ్చం చిన్నితల్లి,రామా!

2.నేను, చెల్లి ఓకొమ్మ,
                         పూవులం!
   ఒక అమ్మ నోముల,
                          పంటలం!
   ఒక ఇంట వెలిగే,
                          దివ్వెలం!
   రక్తసంబంధం నిలిపే,
                          రవ్వలం!
 చెల్లి, అచ్చం చిన్నితల్లి,రామా!

2.నాచెల్లికి నేనంటే ఓ ఆట!
    నాచెల్లి పిలిస్తే అదే పాట!
    మా ఇల్లు ఆనందాల తోట!
    మా బతుకు పూలబాట!
చెల్లి, అచ్చం చిన్నితల్లి ,రామా !

4..నాచెల్లి నాఆరోప్రాణం!
    సద్గుణాల స్వర్ణాభరణం!
    ఈఇంటి వెలుగుల తోరణం!
     ఓ ఇంటి.  శ్రీలక్ష్మీచరణం !
 చెల్లి, అచ్చం చిన్నితల్లి, రామా!

5.నాచెల్లి వయసున పెరగాలి!
   చదువులో ఎత్తు ఎదగాలి!
   వైభవంగా పెళ్లి జరగాలి!
   పెళ్లిపల్లకి నేనే మోయాలి!
 చెల్లి,అచ్చం చిన్నితల్లి, రామా !

6.నాచెల్లి కట్టే రక్షాబంధనం!
   వెన్నంటి ఉండే వజ్రాయుధం!
  ఆమె సౌభాగ్యం వరదానం!
  రక్షణకై జన్మాంతం వాగ్దానం!
 చెల్లి, అచ్చం చిన్నితల్లి, రామా!
_________


కామెంట్‌లు