ఈటీవీ పిల్లలం-మాటీవీ మల్లెలం.;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ .9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఈటీవీ చిట్టి పిల్లలం
మాటీవీ పొట్టి మల్లెలం
ఓనమాలు రాసేటి వారలం
సినిమాలు చూసేటి పోరలం !

ఈటీవీ స్టూడియోకి వెళ్తాం
సీమ టపాకాయల్లా పేల్తాం
మాప్రేక్షకుల ముందు వాల్తాం
మానట జీవన శకఠాన్ని తోల్తాం!

తోటి నటులతో కలిసి మెలిసి ఉంటాం
వారి హావభావముల పరిశీలిస్తుంటాం
వారి పాత్రాఔచిత్యాన్ని గమనిస్తుంటాం
మా నటనను పోల్చుకొని తీర్చిదిద్దుకుంటాం!

మేం సీరియల్స్.లో కూడా నటిస్తుంటాం
మా ఏరియాల్లో మీటౌతుంటాం 
కెమెరాలతో షూట్ చేపిస్తుంటాం
తగిన పోజులు మేం ఇస్తుంటాం !

దర్శకుల సూచనలను పాటిస్తాం
వారు కోరిన విధంగా నటిస్తాం
నభూతో న భవిష్యత్త్ అనిపిస్తాం
వీక్షించే ప్రేక్షకులను ఇక మెప్పిస్తాం!

కవిత్వమన్న కళలన్న మాకిష్టం
వాటికై పడతాం ఎంతైనా కష్టం
మాకు కూడా కలుగొచ్చు నష్టం
అని మేం చేస్తున్నాం ఇకస్పష్టం !

యాంకర్లుగా కూడా మేం పనిచేస్తాం
బ్యాంకర్ల్,గా మారి పెట్టుబడి ఇస్తాం
ఊరూరా పెడతాం మేమిక సెలక్షన్లు
ఊరుతూ వచ్చిపడతాయి కలక్షన్లు

పెట్టుబడి పెట్టినవారిని సెలెక్ట్ చేస్తాం
వారితో నటింపజేసి సీరియల్స్ తీస్తాం
ఇక కురుస్తుందిలే మాకు కనక వర్షం
పెట్టుబడిదారులందరికి కలుగు హర్షం !

సీరియస్,గా మేము ఆలోచిస్తాం
సీరియల్సకు ఇక మాటలు రాస్తాం
ఇక పాటల పేరడీలు కూడా చేస్తాం
చిత్ర జగత్తుకు కొత్త దారులు తీస్తాం కామెంట్‌లు