జీవితం బుడగ లాంటిది;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 జీవితం బుద్బుద ప్రాయము అని వేదాంతులు చెబుతారు. ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేము. హాయిగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నవాడు అకస్మాత్తుగా ప్రాణాలు వదిలివేయవచ్చు. మన చేతిలో పని కాదు చిన్నప్పుడు ఆడుకోవడానికి  వర్షంలో తడుస్తూ  ఆ ప్రవహించే నీటిలో బుడగలు పట్టుకోడానికి ప్రయత్నం చేయడం. చేతిలోకి రాక ముందే అది పగిలిపోవడం ఆ విషయాలు ఇప్పుడు తలచుకుంటే బాగా నవ్వొస్తుంది. కానీ ఆ రోజు అది గొప్ప క్రీడ. ఒక బుడగ రాగానే  స్నేహ బృందం మొత్తం నలుగురు ఐదుగురు దానిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం దాని దగ్గరికి వెళ్లి చేతిలోకి తీసుకుని అందులోనే అది పగిలిపోవడం, ఎంతో ఆశతో వెళ్లిన వీరికి చాలా నిరాశ ఎదురయ్యేది. అయినా పట్టుదలతో ఆడుతూనే ఉంటాం. ఆ వయసులో ఉన్న ఆనందం మరి ఎక్కడ దొరుకుతుంది. ఆ స్నేహాలు వేరు ఇవాళ అలా ఆడుకోవడానికి పిల్లల్ని మనం  అనుమతిని ఇస్తున్నామా?  తల మీద నీళ్లు పడితే జలుబు  చేస్తుంది అటువెళ్ళకు అంటారు పెద్దలు. వాడు నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఎన్నో కలలు వస్తాయి. ఒక రోజు ఒక ప్రేమ కల, పెద్ద మేడలో ఉన్నట్లు గొప్ప జమీందారీ కుటుంబంలో పుట్టి అధికారాన్ని చెలా ఇస్తున్నట్లు, మనకు ఇష్టమైన సినిమాలు చూస్తున్నట్లు, ఒకేసారి వెంటనే మెళకువ వస్తుంది. తీరా ఇది కల అని తెలిసిన తర్వాత ఎంతో నిరుత్సాహానికి గురవుతారు. జీవితంలో భోగభాగ్యాలను గురించి వేమన చెప్పిన అద్భుతమైన పద్యం. వర్షంలో వచ్చిన  బుడగను నిద్రలో వచ్చే కలను  పోలుస్తూ వేమన చెప్పిన తీరు అద్భుతం

.కామెంట్‌లు