ఏ కుటుంబంలో నైనా ఒక వ్యక్తి తన స్వార్ధాన్ని వదిలివేసి సమాజం కోసం పాటుపడుతూ ఉంటాడో అతనిని ఆ గ్రామస్తులంతా అభినందిస్తారు. అతను ఆ గ్రామంలో జన్మించినందుకు అందరూ ఆనందిస్తారు. అతను ఏ కులం వాడు, అతని వర్ణం ఏమిటి అతను ఏ పనైనా స్వతంత్రంగా చేస్తున్నాడా అని ఎవరూ ఆలోచించరు. రాజ వంశంలో పుట్టి దేశానికి పేరు తెచ్చిన శ్రీరామచంద్రమూర్తిని, శ్రీ కృష్ణభగవానుని ఆధ్యాత్మిక శక్తితో అమ్మవారిని తన స్వాధీనం చేసుకున్న రామకృష్ణ పరమహంస. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఈ ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వివేకానంద స్వామిని, ఆధ్యాత్మక చింతనతో అద్వైతాన్ని ప్రపంచానికి తెలియజేసిన మలయాళ స్వామిని ఎవరైనా మీ కులం ఏమిటి అని ఆలోచిస్తారా? వారు చేసిన మంచి పనిని మనస్ఫూర్తిగా అంగీకరించి దానిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు కనుక ఎక్కడ పుట్టినా ఏ వంశంలో పుట్టినా, ఊరు ఏదైనా, ఏ కులంలో పుట్టినా ఏ ఒక్కరూ ఆలోచించడానికి అవకాశమే లేదు. ఉన్నతమైన ఆశయాలతో ఆదర్శంగా జీవించే వ్యక్తి ఏ గృహంలో జన్మిస్తాడో ఆ కుటుంబానికి ఆ పేరు దక్కుతుంది. మనం అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాం రకరకాల పూల చెట్లను, అనేక రకాల మొక్కలను చూస్తూ ఉంటాం కొన్ని చక్కటి వాసనలను విరజిమ్ముతుంటాయి ఆ స్థానంలో గంధపు చెట్టు వున్నది అనుకుందాం దాని వాసన మిగిలిన వాటి వాసనల కన్నా అద్భుతంగా ఉంటుంది. ఎంత సేపు అయినా ఆ చెట్టు కింద కూర్చోవాలి అనిపిస్తుంది వారి అలసటను అక్కడ కూర్చుని తీర్చుకుంటారు. అలా గంధపుచెట్టుతో పోల్చి
చెప్పారు వేమన.
చెప్పారు వేమన.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి