ప్రారంభంలో మనిషి జీవితం దిగంబరంగా ఆకలి తీర్చుకోవడానికి కనిపించిన జంతువుని వేటాడి దాని పచ్చి మాంసం తిన్న రోజులు ఆ రాతియుగం. దానిని దాటి కొంచెం ముందుకు వస్తే ఆకులతో మానాన్ని కాపాడుకుని పచ్చి మాంసాన్ని వేయించి తినడం మొదలు పెట్టిన తర్వాత అసలు మనం ఏమిటి ఎందుకు ఈ లోకం లోకి వచ్చాము అన్న విషయాల గురించి ఆలోచించుకుంటూ మారుతున్న కాలంతో పాటు అలవాట్లను కూడా మార్చుకొని కుటుంబ వ్యవస్థలో వచ్చిన సమాజం కొన్ని నియమాలకు నిబంధనలకు కట్టుబడి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు ఎవరి పని వారు చేసుకుంటూ ఎవరికి కావలసిన వస్తువులను వారు వస్తుమార్పిడి తో ప్రారంభించి డబ్బుతో కొనుక్కునే దుస్థితికి వచ్చాం. కోర్కెలు అనంతంగా ఉంటాయి వనరులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. దానితో ఒకరినొకరు మోసం చేసుకోవడం దగా చేసి తన పబ్బం గడుపుకోవడం దీని తర్వాత మతం పేరుతో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాలను క్రమబద్ధం చేయడం కోసం ప్రవక్తలు ముందుకు వచ్చారు. ప్రవక్తల ప్రయోగం ఫలించింది కానీ ఈ మతాల పేరుతో ధనాన్ని ఎలా సంపాదించాలి అన్న ఆలోచన కొంతమందిలో ప్రారంభమయింది. దేవాలయాల కోసం అనాథలకు భోజన ఏర్పాట్లు కోసం ఇంకా ఎన్నో పేర్లు చెప్పి ధనవంతుల వద్దకు వెళ్లి వారి దగ్గర చందాలు పోగుచేసి దానిని స్వార్థం కోసం వాడుకోవడం. కాషాయం అంటే ప్రతి వారికి గౌరవభావం వుంటుంది కనుక ఆ పేరుతో ఎలా మోసం చేయొచ్చు అని కొంతమంది ఆలోచించి దొంగ సాధువులుగా ఈ సమాజంలోకి వచ్చారు పూజలు పునస్కారాలు అంటూ వేలకు వేలు వసూలు చేసి భగవంతుని పేరుతో లక్షల కోట్ల ఆస్తులను స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఆలోచిస్తే నిజం బయటపడక పోతుందా భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఆయన దర్శనమిస్తాడా? వీరు చెప్పినంత మాత్రం చేత భగవంతుడు భక్తులకు సాయం చేస్తాడా? అని ఒక్కరైనా ఆలోచించి ఉంటే ఇలాంటి తతంగాలకు తెర పడదా. ఒళ్లంతా విబూది పూసుకుని శంఖం ఊదుతూ తిరిగినంత మాత్రం చేత శుభాలు జరుగుతాయా? గుడిలోకి వెళ్లి, గుహలోకి వెళ్లి తన ఇష్ట దైవాన్ని పూజించుకుంటూ కూర్చున్నంత మాత్రం చేత వారి పనులు చక్కబడతాయా? నిజమైన దేవుడి దర్శనం కావాలనుకుంటే అంతర్లీనమై తనను తాను తెలుసుకున్న రోజున చీకటిలో ఉన్న తనకు వెలుగు సాక్షాత్కరిస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా పైపై వేషాలకు మోసపోయి ఇబ్బంది పడితే మానసికంగా ఎంత వేదన అనుభవించవలసి వస్తుందో వేమన ఈ పద్యంలో చెబుతున్నారు.
కొండ గుహలనున్న
గోవెళలందున్న మెండుగాను బూది మెత్తియున్న
దుష్ట బుద్ధులకును దుర్బుద్ధి మానునా...
కొండ గుహలనున్న
గోవెళలందున్న మెండుగాను బూది మెత్తియున్న
దుష్ట బుద్ధులకును దుర్బుద్ధి మానునా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి