కవిసమ్రాట్ విశ్వనాథ వారు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆంధ్ర దేశమే కాక యావద్భారత దేశం గర్వించదగిన అత్యద్భుత  కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అన్ని ప్రక్రియలను చవిచూసిన వారు  కళాశాలలో  అన్ని స్థాయిలలో  ఉద్యోగాలు నిర్వహించిన వారు  కవిగా, రచయితగా, వ్యక్తిగా  ఆయనకు ఉన్న పేరు మరెవ్వరికీ లేదని నా ఉద్దేశ్యం. ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావు గారు ఎస్.ఆర్.ఆర్ జూనియర్ గవర్నమెంట్ కాలేజ్  విజయవాడలో చదువుతున్న సందర్భంగా గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు నాగమ్మ నాటకాన్ని రాసి  కళాశాలలో ప్రదర్శించడానికి  రామారావు గారితో నాగమ్మ వేషం వేయించారు. అప్పుడే రామారావు గారికి నునూగు మీసాలు వస్తున్నాయి. వాటిని తీయనని భీష్మించుకు కూర్చున్నారు మీసాల తోనే వేయి మీసాల నాగమ్మ అనే పేరు పెడదాం అన్నారు విశ్వనాథ వారు. అప్పటి నుంచి వారు రామారావు గారిని  మీసాల నాగమ్మ అనే పిలిచేవారు. తరువాత రామారావు గారు పేరు ప్రఖ్యాతలు  వచ్చిన  తదుపరి విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా గురువుగారిని అధ్యక్షులుగా  ఆహ్వానించేవారు. గురువు గారికి  ఆరోజు కుదరకపోతే ఆయన కోసం  ఆయనకు కుదిరిన రోజున ఏర్పాటు చేసుకునేవారు. రామారావు గారికి అంత గురుభక్తి  నేను ఆకాశవాణిలో చేరిన తరువాత ఉషశ్రీ గారి ద్వారా వారితో సంబంధం ఏర్పడిన తర్వాత వారు నన్ను కుటుంబ సభ్యులు లాగానే చూసేవారు.  ఆ తర్వాత ఒక రోజు వారి రచనల గురించి మాట్లాడుతూ  వాల్మీకి మహర్షి అద్భుతంగా  ధర్మాన్ని ప్రతిష్టస్తూ  రామాయణం గొప్పగా రాశారు కదా అంతకన్నా బాగా రాయాలనే అభిప్రాయంతో  మీరు ఈ ప్రయత్నం చేశారా?  మీరు చాలామందికి చెప్పిన సమాధానం తిన్న అన్నమే తిరిగి తింటున్నాం అని చెప్పిన సందర్భాలున్నాయి. అలా కాకుండా మీ మనోగతాన్ని  చెప్పగలరా  అంటే పకపకా నవ్వి ఏరా  ఆ మహర్షి కన్నా గొప్పగా రాయడమా  నేనే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరూ రాయలేరు. ఆయనలో వందో వంతు రాయగలిగితే మన జన్మచరితార్థం అవుతుంది.  అదే కాదు రా  వాల్మీకి మహర్షి రాసిన వాచ్యాన్ని  నేను దృశ్యం చేయడానికి ప్రయత్నం చేశాను తప్ప వారితో పోటీ ఏమిటి  రా  అని మళ్లీ నవ్వేరు  ఆయన వ్రాసిన వేయిపడగలు  భారతీయ సంస్కృతి సంప్రదాయాలసారం మొత్తాన్ని  వ్యక్తీకరించారు  దానిని మన ప్రధాని  పీవీ నరసింహారావు గారు హిందీలో అనువదించి  కేంద్రానికి పంపితే జ్ఞానపీఠ బహుమతుల నిర్ణయాధికారి బెజవాడ గోపాల్ రెడ్డి గారు  దానికి  బహుమతులు ఇచ్చారు. అంత గొప్ప బహుమతి పొందిన  విశ్వనాథ వారికి ఇసుమంతైనా  గర్వం లేదు  వ్యక్తిగా అహం ఎంత వరకు ఉండాలో అంత వరకే  అహంకారి మాత్రం కాదు వారు ఎప్పుడూ చిరునవ్వుతోనే సమాధానం చెబుతూ ఉంటారు. వారి వ్యక్తిత్వాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహా యోగి  వ్యక్తిగతంగా  నన్ను ఆప్యాయంగా చూడడం  మా గురువుగారు ఉషశ్రీ గారి  పుణ్యం.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం