మందు ప్రభావం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 ఏదైనా జబ్బు చేసిన రోగి వైద్యుల వద్దకు వచ్చి నేనిలా బాధపడుతున్నాను అని చెప్తే ప్రమాదం లేదు మందువాడు తగ్గిపోతుంది అది ఏమీ చెయ్యదు అని సమాధానం చెప్తారు. కానీ సామాన్యులకు మందు అంటే మరొక అర్థం వుంది. సాయంత్రమయ్యేసరికి  నోరు పిడచ కట్టుకుపోతుంది ఒక చుక్క పడితే


గానీ మామూలు మనిషి కాడు వీరికి మందు అంటే సారా, విస్కీ, బ్రాందీ, కల్లు మరి కొంచెం నోటికి అందిస్తే చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతాడు తెల్లవారి డబ్బులన్నీ పోయాయని ఏడుస్తాడు. ఉషశ్రీ గారు గొప్ప మాట చెప్పేవారు. గొంతులో పోసేది గుంతలో పోస్తే ఇల్లు లేస్తుంది అని ఇలాంటి వారిని అలాంటి మాటలతో పోల్చవచ్చు. ప్రస్తుతానికి వస్తే వేమన మందు నాలుగు రకాలుగా ఎలా వాడవచ్చునో చెబుతున్నారు. శరీరానికి పోటు వస్తే ఆ బాధను తగ్గించడానికి మందు వాడాలి లేకపోతే మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమంది దళారులు  మీరు ప్రేమించిన యువతి మీకు సొంతం కావాలంటే  నేను ఒక మందు ఇస్తాను ఆమె అది తీసుకుంటే   మీకు స్వాధీనమవుతుందని మాయ మాటలు చెబుతాడు.  డబ్బు ఖర్చు చేయడం తప్ప పని జరగదు. ఏ జబ్బు చేసినా దానికి ప్రత్యేకమైన మందు ఉంటుంది దానిని వాడితే ఆ జబ్బు తగ్గిపోతుంది జబ్బు లేకుండా ఆరోగ్యరీత్యా  శరీరానికి బలం కావాల్సి వస్తే దానికి మందు ఉంది అని వివరించారు వేమన.


కామెంట్‌లు