నిష్కళంక దేశభక్తుడు పింగళి వెంకయ్య;-గుండాల నరేంద్ర బాబు నెల్లూరు-సెల్:9493235992
పల్లవి:

నిష్కళంక దేశభక్తి వీరుడా
నిస్వార్థ  సేవా తత్పరుడా 
నిలువెత్తు తెలుగు జాతి రేడా 
విలువైన భరత ఖ్యాతి  మేడా 

చరణం:1

జాతికే  గౌరవ సoకేతమా
నీతికే నిర్మల హృదయమా
కీర్తికే శిఖరాయ మానమా
ఆర్తికే ఆదర్శప్రాయమా
స్ఫూర్తికే నిత్య నిదర్శనమా
హారతికే అగ్రతాంబూలమా

చరణం:2

త్యాగానికి  కాషాయ వర్ణమే 
అభివృద్ధికి  ఆకు పచ్చ వర్ణమే
శాంతి అహింసకు శ్వేత వర్ణమే 
సత్యం ధర్మo  అశోక చక్రమే
సర్వమత సమత త్రివర్ణపతాకమే  
భిన్నత్వమున్నా ఏకత్వమే  

చరణం:3
స్వాతంత్ర్య ఉద్యమ కొదమ సింహమా
సర్వమతా సమతా స్వరాజ్యమా
పలు  పతాకాల పరిశీలకుడా
పలు భాషల్లో బహుళ శ్రేష్ఠుడా
సైనిక శిక్షణలో ప్రావీణ్యుడా
'వజ్రపు తల్లి రాయి' విరచితుడా

చరణం:4

మైకా గనులా పరిశోధకుడా
మువ్వన్నెల జండ శిల్పకారుడా
అధ్యాపకత్వమే వెలుగు జాడ
త్యాగభావనే అడుగు జాడా
పింగళి వెంకయ్య జోహార్లయ్య 
అందుకోండి మా జేజేలయ్యా
==================
(భారత జాతీయ పతాక శిల్పి పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి సందర్భంగా )


కామెంట్‌లు