ముక్త పదగ్రస్తం(బాల గేయం)-గుండాల నరేంద్ర బాబు -9493235992
కొమ్మల్లో కోయిల కమ్మనీ పాట
పాట వింటూ పోతే తేనెల్ల తేట
తేట తెలుగుల్లోనే బంగారు బాట
బాట వెంటే  సాహిత్య సిరుల పంట
పంటలో దాగుంది ముత్యాల మూట
మూటలన్నీ చేరేను రతనాల కోట
కోట పక్కన చూడ చక్కని తోట
తోటలో యువరాణి ఆడె అందాల ఆట
ఆటల్లో అగ్రశ్రేణిగా నిలిచె ప్రతిపూట
పూట పూటకు పలికెడు పసిడి మాట
మాటతో పుత్తడి బొమ్మెక్కెను పెండ్లి పీట
పీటల నున్న జంట చూడ తరలే పేటపేట
 
===================================
గుండాల నరేంద్ర బాబు -9493235992
తెలుగు పరిశోధకులు
శ్రీ వేoకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి



కామెంట్‌లు