మంగళ హారతి ;-ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ)ఫోన్ నం.9949267638
శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ
మనింటికొచ్చింది
కర్పూర హారతి వెలిగించి
హారతి ఇవ్వండి
ఆ తల్లికి స్వాగతం పలకండి
// శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //

పసుపు కుంకుమ గంధాలు
పచ్చని పట్టూ వస్త్రాలు
రంగు రంగుల పూలతో లక్ష్మీని
ఆనందంగా కొలువండీ
// శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //

నిండుమనసుతో దేవిని కొలిచిన
సకల శుభాలు కలుగమ్మా
సౌభాగ్యాలు సంతోషాలు
ఆరోగ్యాలు కలుగమ్మా
// శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //

కోరిన వరాలు ఇచ్చే తల్లీ
వరలక్ష్మికి పూజలు చేద్దాము
పచ్చని పంటలు ధన ధాన్యాలు
ఇచ్చే తల్లిని ఆర్చిద్దాము 
//శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //

చంద్రుని సోదరి చల్లని తల్లీ
శ్రీ మహాలక్ష్మీని కొలువండీ
ఆదినారాయణుని ఆత్మీయ సఖి
ఆది లక్ష్మీని కోలువండీ
// శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //

సకల విద్యలు సర్వ శాస్త్రములు
జ్ఞానము తెలివి తేజస్సు
ఇచ్చే తల్లీ వాగ్దేవి
శార్యం ధైర్యం వీరత్వాన్ని
ఇచ్చే మాతా పార్వతిని
ఆనందంగా అర్చన చేయాలి
సర్వ శుభ ప్రదము మనం పొందాలి
// శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ //


కామెంట్‌లు