మువ్వన్నెల జెండా (పింగళి వెంకన్న జయంతి సందర్బంగా )-ప్రభాకర్ రావు గుండవరం-ఫోన్ నం.9949267638
మూడు వన్నెల జెండ మనది 
ముచ్చటైనా జెండరా
పింగళి వెంకన్న చేతిలో
రూపు దిద్దిన జెండరా 

భరత జాతి కీర్తిని
మూడు రంగులో తెలిపెను
మన జాతి  గొప్పతనమును
గగన వీధిన చాటెను 

ఆత్మస్థైర్యం త్యాగము
కాషాయ వర్ణము చూపును
శాంతి స్వచ్చత నీతిని
తెలుపు రంగు సూచించును
పచ్చదనము పాడి పంటలు
ఆకు పచ్చ రంగులో కనిపించును

ధర్మానికే ప్రతిరూపమైన 
హిందూ దేశము మనదిరా
నీలి రంగులో అశోక ధర్మ చక్రము
జెండా మధ్యలో ఆగుపించు ముదము 

తెలుగు తేజము
స్వాతంత్ర్య యోధుడు
భరతమాత ముద్దుబిడ్డ
పింగళి వెంకన్న మనకు
మన దేశానికే ఆదర్శమూర్తిరా
🌹🌹🌹

కామెంట్‌లు