అందమైన కట్టడం;-నూతన్ కుమార్,9వ, తరగతి,జి.ప.ఉ.పాఠశాల,అమడబాకుల,వనపర్తి జిల్లా.
 ఈమధ్య నేనో విషయం చదివాను. అదినాకు నచ్చిన ప్రదేశం, నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అదే తాజ్ మహల్. ఇది ఒక అత్యద్భుతమైన కట్టడం. ప్రపంచంలో ఇంత అందమైన కట్టడం మరెక్కడా లేదు. కాబట్టి ఇది ప్రఖ్యాతి పొందినది కేవలం సౌందర్యానికే కాక ప్రేమకు చిహ్నంగా మిగిలిపోయింది. ఈ తాజ్ మహల్ ను మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. ఆమె ఎవరో కాదు ముంతాజ్ . ఈమె షాజహాన్ మూడో భార్య. ఈ తాజ్ మహల్ పాలరాతితో నిర్మించబడింది. ఇలాంటి నిర్మాణం భారత దేశంలో తప్ప మరెక్కడా లేదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శనీయ ప్రదేశం, పర్యాటక ప్రదేశం తాజ్మహల్ కు నిర్మించబడిన స్తంభాలు, ఆ కట్టడం, ప్రకృతి విపత్తుకు ధ్వంసం కాకుండా నిర్మించారు. ఈ నిర్మాణాన్ని సపోర్ట్ చేసే నాలుగు స్తంభాలు కూడా బయటకు వాలి ఉంటాయి. తాజ్ మహల్ నిర్మాణానికి ఆసియా ఖండంలోని వివిధ ప్రదేశాల నుండి అనేకమైన విలువైన రాళ్లను తెప్పించారు. ఇందుకు జపాన్ నుండి మార్బల్స్, పంజాబ్ నుండి మరియు టిబేట్ నుంచి నీలపురాయి, ఆఫ్ఘనిస్తాన్ నుండి లపీస్ 
లౌజాలి,  శ్రీలంక నుండి చైనా నుండి క్రిస్టల్స్ తెప్పించడం జరిగింది. తాజ్ మహల్ నిర్మాణంలో 4 సూత్రాలు ఆచరించారు. పర్షియన్ తుర్క ఇండియన్ మరియు ఇస్లామిక్ స్టైల్ అన్ని కలిపి తాజ్ మహల్ నిర్మాణం ఏర్పడింది. అద్భుత నిర్మాణంలో పాల్గొనిన పనివారల చేతులను నరికి వేయమని, మరియు మరల వారు వేరే ఏ ఇతర ప్రదేశంలోనూ ఇటువంటి అద్భుత నిర్మాణం చేయరాదని ఆజ్ఞాపిస్తూ షాజహాన్ ఆజ్ఞలు జారీ చేశాడు. ఫలితంగా తాజ్ మహల్ నిర్మించిన పనివారలు తమ చేతులను సైతం పోగొట్టుకున్నట్టు చెబుతారు. కథనాల మేరకు యమునా నదికి ఆవలి ఒడ్డున తాజ్ మహల్ ను నలుపు రంగులో నిర్మించుకోదగినట్లు కూడా చెబుతారు. అయితే తన కుమారుడు ఆయనను చెరసాలలో పెట్టిన కారణంగా షాజహాన్ ఏ పని చేయలేకపోయాడు. ఆగ్రాలోని తాజ్ మహల్ మారకుండా నిర్మాణం లోపల ఉంచిన షాజహాన్ మరియు ముంతాజ్  రెండు సమాధులు సమరూపం తలను ఒకే విధంగా నిర్మించబడింది. చక్రవర్తి, ఆయన భార్య ముంతాజ్ మహల్ సమాధులు ప్రజలకు బయటకు కనబడవు. సందర్శకులు చూసే ప్రాకారము లోపలి భాగంలో అవి ఉంటాయి. ఈ సమాధులు ఉపరితలం నుండి ఏడు అడుగుల లోతులో ఉంది. ఒక మెటల్ డోర్ లో లాక్ చేయబడి ఉంటాయి. నిర్మాణం యొక్క మెయిన్ డోర్ పై కురాన్ లోని శ్లోకాలు ఉంటాయి. ముంతాజ్ ఇరుపక్కల 9 పేర్లు చెక్కారు. ఇది ప్రపంచ వింతలలో ఒకటి. దీన్ని చూడాలని నా కోరిక.


కామెంట్‌లు