ఖ్యాతి;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాబూపాపా ఇటురండీ
భావి భారత పౌరుల్లారా 
పెద్దల ఆశాజ్యోతుల్లారా
బుడిబుడి నడకలు మీరూ నడిచీ 
ముసిముసి నవ్వులు మీరూ నవ్వీ
సింహపు బొమ్మతో ఆడుతు మీరూ
కేసరిలాగా మారాలి
సివంగి బొమ్మతో ఆడుతు మీరూ 
ఝాన్సీరాణిగా మారాలి 
మదర్ థెరిస్సా కథలను వింటూ
విశ్వమాతలుగా మారాలి 
శివాజి కథలను వింటూ మీరూ 
భవాని ఖడ్గం పొందాలీ
నెహ్రూ కథలను వింటూ మీరూ 
శాంతదూతగా మారాలి 
గాంధీ కథలను వింటూ మీరూ
సత్యాహింసలు చాటాలి
చదువులుచక్కగ చదవండీ
దేశానికి ఖ్యాతి మీరేనండీ !!

కామెంట్‌లు