వి ' చిత్రం'...!!---డా.జి.ఎన్.రావు, హైదరాబాద్.

 ఓ...ప్రియా....
వయసు పండి
బ్రతుకు ఎన్డి
మోడౌతున్న-
తరుణంలో,
ఎన్త విచిత్రం!
ఎడారిలో-
మంచు బిందువులా,
ఆపదలో-
ఆత్మ బంధువు లా,
వడివడిగావచ్చి
వాలావునావడిలో
ఒక్కటి....
ఒక్కటంటేఒక్కటి
ఆశాభీజం నాటావు
నా హృదిలో....
ఎంత విచిత్రం-
మరుక్షణం 
మొలకెత్తిన్ది
జీవితం పై-
మమకారం!
చుట్టానుకోరికలకు
సింగారపు శ్రీకారం!
ఇది..మరీ..మరీ
విచిత్రం కదూ...!!
          ***
కామెంట్‌లు