హర్ ఘర్ తిరంగా జిల్లా ర్యాలీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్


 ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శనివారం కరీంనగర్ లో జిల్లా ర్యాలీ ఘనంగా నిర్వహించారు .ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్ధులు, ఉపాధ్యాయులు,ఉద్యోగులు,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్,ఎన్ సి సి,ఎన్ ఎస్ ఎస్ విద్యార్ధులు పాల్గొనడం జరిగింది.కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ ర్యాలీలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సిహెచ్ వి యన్ జనార్ధనరావు గారితో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి శ్రీ కంకణాల రాంరెడ్డి,జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీ డాక్టర్ అడిగొప్పుల సదయ్య, జిల్లా హెడ్ క్వార్టర్ కమీషనర్ శ్రీమతి సిహెచ్ ఇందిర మరియు 20 మంది స్కౌట్ మాస్టర్లు,గైడ్ కేప్టన్లు,స్కౌట్ లు పాల్గొన్నారు.
కామెంట్‌లు