సీసము
మాధవ హృదిలోన మరులు గొల్పెడి రాధ
రాధమ్మ మది వేణు రాగమొలక/
రాగబంధపు టూహ రమణీయ కావ్యమై
నవనవోన్మేషణ నవ్యరీతి /
సాగుచుండెను కదా!సర్వజగత్తులో
రమ్యమై సాకార రాసలీల/
తరతరంబులు దాటి తార చంద్రుల దాటి
రంజిల్లుచుండెనీ రాగ హేల/
తేట గీతి /
సకల జీవులందున ప్రభాసకిరణమ్ము
ప్రేమ భావన నింపెడి పెన్నిధిగను
రాధ నేలెడి మాధవ గాథ నేడు
చిత్రరూపమై నిల్చెను చిత్తమందు.
---------------------
చిత్ర స్పందన.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి