కాలం తెచ్చిన మార్పు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
మనుషుల మాటలలో ఏ 
మార్పూ రాలేదు కాని,
మాట తీరులో మార్పు వచ్చింది...
మనుషుల పనితనంలోని 
నేర్పులో మార్పు రాలేదు కాని,
పని చేసేటప్పుడు ఉండవలసిన 
ఓర్పులో మార్పు వచ్చింది...
మనుషుల విభిన్న 
ఆలోచనలలో మార్పు 
అంతగా రాలేదు కాని,
ఆలోచనలను 
ఆచరించే విధివిధానాలలో 
మార్పు వచ్చింది...
మనుషుల కంట జారే 
కన్నీరులో మార్పు 
రాలేదు కాని, కలతలకు 
గల కారణాలలో
మార్పు వచ్చింది...
మనుషుల అచ్చమైన 
జీవితాలలో ఏ మార్పు 
రాలేదు కానీ,
నిత్యం నూతనమైన
జీవన శైలిలో 
మార్పు వచ్చింది...


కామెంట్‌లు