ఏనుగు ముఖము...
ఎలుక వాహనము !
ప్రమథ గణములకధిపతి
వినాయకుడితడు.... !!
అమ్మ ముచ్చటకు బుట్టిన
గారాల పట్టి.... !
కర్తవ్యనిష్ఠలో....
ఇతనికితనే సాటి !!
ఆధిపత్య పోటీలో...
యుక్తిని ప్రదర్శించి....
ఆశ్చర్యము కలుగురీతి
విజయుడై నిలిచినాడు !
అపహాస్యమేరికీ....
చేయవలదని...
తగురీతి దండించి... .
శశికి బుద్దిచెప్పిన మేటి !
వ్యాసుని వేగమున
కేమాత్రమూ తగ్గక...
మహాభారతము రచించిన
ఘనుడీ వినాయకుడు !
దేవతలందరిలోనూ...
ఆదిపూజలంది ....
విఘ్నములను బాపు
గణ నాయకుడితడు !
భక్తి, శ్రద్ధలతోడ.....
కొలుచువారి...
కొంగుబంగారమీ....
లంబోదరుండు !
ఓం శ్రీ మహా గణాధి పతయే నమః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి