" సమసిపోవాలని...... ! "--కోరాడ నరసింహా రావు.
 జరుగుతున్న అన్యాయాలను చూస్తూ సహించలేక నిరసించి 
పోరాటాలతో అలసి,సొలసి  నీరసించి పోవటమే  ... !గెలుపు గర్వంతో అవి మరింత రెచ్చిపోతున్నై !!
ఆయుధం పడదామనుకుంటే
సాయుధపోరాటాలు,హిoసనీ రక్తపాతాన్నీ తప్ప...సమస్యను 
పరిష్కరించలేవని తరతరాల చరిత్ర చాటుతోంది !
వ్యష్టిగా సాధించలేనిది.... సమిష్టికి సాధ్యపడుతుందని మన భారత స్వాతంత్ర్య సంగ్రా మమే  నిరూపించిందిగా!
అందరినీ ఒకటిచేసే శక్తి అక్షర ఆయుధానికి తప్ప మరిదేని కుంది... ! ? ప్రజల్ని చైతన్య పరచే పాట గొప్పది కదూ... !
అందుకే...నేను పాటనై పల్లవిం
చాను..,జనంలో భావావేశాన్ని 
పొంగించాలని !
 కవితనై ప్రభవించాను...నా ఈ 
భవ్య ప్రకాశంలోజనం,సత్యాన్ని
స్పష్టంగా చూడాలని, వాళ్లలో చైతన్యంరావాలని...ఈజనబల
ధర్మబద్ధ శాంతియుత పోరాటం తో... సమస్యలన్నీ సమసి పోవాలని... !
     ******

కామెంట్‌లు