తెల్ల కాగితం;--గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు.
తెల్లతెల్లని కాగితం
అందరికి ఉపయోగం
పుస్తకాల తయారీకి
అత్యంత ఆవశ్యకం

అది లేక పని సాగదు
ప్రతిచోట  కావాలోయ్!
పరీక్షల సమయంలో
కాగితాలు ఉండాలోయ్!

రాయడానికి పిల్లలు
చేయడానికి పడవలు
కవులకు,రచయితలకూ
తోడ్పడును కాగితాలు

విలువైనది కాగితం
వెలలేనిది జీవితం
రెండునూ ప్రాముఖ్యం
తేల్చునోయ్! భవితవ్యం

జగమే  ప్లాస్టిక్ మయం
స్వచ్ఛత చూడ మాయం
ప్లాస్టిక్ నిషేధించాలి
కాగితమే వాడాలి


కామెంట్‌లు