దేశ భక్తి(నానో కథ)- సుమ కైకాల
 "అమ్మా,  డాడీ ఇంటి మీద జెండా ఎగురవేసారు కదా" అది నాకు ఆడుకోవడానికి ఇస్తావా?" అన్నాడు బన్నీ దేవితో.
"స్వాతంత్ర దినోత్సవం అయిపోయాక ఇస్తానులే...వెళ్లి ఆడుకో"...
"ఏంటి అన్నావు?" లోపల నుండి బయటకు వస్తూ అన్నాడు మధు.
"ఆడుకోవడానికి జెండా అడుగుతున్నాడు. 15వ తారీఖు తరువాత ఇస్తాను అన్నాను"...
"వాడికి తెలియక పోతే నీకు తెలియదా? జెండా నేలను తాకకూడదు.15వ ఆగస్టు మాత్రమే కాదు ఎల్లప్పుడు భద్రపరచి ఉంచాలి. జెండాని అగౌరవపరచినట్లు నాకు తెలిసిందో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త!" అన్నాడు మధు.
"అవును, నిజమే! మరెప్పుడూ అలా మాట్లాడను. బన్నీకి అర్థమయ్యేలా వివరిస్తాను" 
వారి ఇంటి మీద జెండా ఆనందంగా మరింత అందంగా ఎగురుతోంది...

కామెంట్‌లు