*దుస్థితిని దూరం చేసుకో * కోరాడ నరసింహా రావు.
ఓ మనిషీ... !  మట్టి తన    చేతుల్తో  అన్నిసుఖాలనూ అందించే కల్పతరువును నీ చేతుల్లో పెడుతోంది... !!

 నీచేతుల్తో దాన్ని పోషిస్తూ... 
  తన వృక్ష సంతతిని పెంచి... 
   తర తరాలూ ఆనందంగా 
      బ్రతకమంటే...., 

నీ స్వార్ధానికి సమ్మూ లంగా...
తుదముట్టించేస్తుంటే... 
  అడ్డంగా నరికి నిలువునా... 
  కూల్చేస్తుంటే... నీ అజ్ఞానానికి 
   ఆవేదనతో  మౌనంగా....   
     రోదిస్తోంది !

నీ ఆనందహర్మ్యాలకి   అది పునాదులు వేస్తుంటే... 
   ఆ పునాదులకిందే వాటిని సమాధి చేస్తున్నావ్ !!

ఓ అవివేకి... ఇకనైనా మేలుకో 
చేస్తున్న తప్పులను సరిదిద్దుకో 
విరివిగా మొక్కలను నాటు.. 
నాటించు.,  గాలి, నీరు, తిండి దొరకక నువ్వూ, నీ వారసులు విల - విల లాడే దుస్థితిని.. 
    దూరంచేసుకో !
   ******

కామెంట్‌లు