అనువంశిక కులం ఒక పరిశీలన!!?;- ప్రతాప్ కౌటిళ్యా
 కేవలం హైందవ సంస్కృతిలోనే కుల వ్యవస్థ ఏర్పడింది. మనుధర్మ శాస్త్రం దానికి మూలం కావచ్చు. ఇంతకుముందు కూడా కులం ఉందో లేదో తెలియదు కానీ మతం మాత్రం ఉంది. హిందూ మతం కుల వ్యవస్థను శాస్త్రీయ వ్యవస్థ గా హిందూ ధర్మ శాస్త్రం గా భావిస్తుంది. కులం కూడా ఒక వ్యవస్థ. ఒక లక్షణం ఒక ధర్మం అని భావిస్తున్నాం నిరూపిస్తున్నాం. దీన్ని శాస్త్రీయంగా పరిశోధిస్తే కులం ఒక అనువంశిక లక్షణం. సాధారణంగా హిందూమతంలో ఒక కులం వారు ఆ కులం వారినే వివాహమాడి సంతతిని పొందుతారు. అంటే వారిది అనువంశిక కులం అన్నమాట. కులం పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు అది కొనసాగుతూనే ఉంది. కనుక కులం ఒక అనువంశిక లక్షణంగా, మతం కూడా ఒక అనువంశిక మతంగా మనం భావిస్తాం. ఎందుకంటే ఏ మతం వారు ఆ మతంవారిని వివాహం చేసుకొని సంతతిని పొందుతారు కాబట్టి
మతం కూడా ఒక అనువంశిక మతం గానే భావిస్తాం. మనకు స్పష్టంగా కులం మతం అనువంశిక వ్యవస్థ అనువంశిక లక్షణం అని అర్థమవుతుంది. కులం వ్యవస్థను శాస్త్రీయంగా ఆలోచిస్తే, జన్యు శాస్త్ర పరంగా చాలా లాభాలు ఉన్నాయయి. కులం లో కూడా ఉపయుక్త అనుపయుక్త జన్యువులు ఉంటాయి. సరిగ్గా జంతువులలో మొక్కలలో శాస్త్రీయంగా ఉపయుక్త అనుపయుక్త అనువంశిక లక్షణాలు ఉన్నట్లు తర్వాతి తరాలకు మేలు రకమైన లక్షణాలని ఆపాదించబడడానికి ప్రయత్నిస్తుంది ప్రకృతి. కాకపోతే కుల వ్యవస్థలో మనిషి తన కులంలోని ఉపయుక్త లక్షణాలను తర్వాతి తరాలకు అందించడానికి కులాన్ని శాస్త్రీయ లక్షణంగా తీసుకుంటున్నాడు అనాదిగా. ఇది కాకతీయమైన శాస్త్రీయంగానే తరతరాలుగా జరిగింది. కనుక కులం ఒక శాస్త్రీయ అనువంశిక లక్షణానికి ప్రధాన కారణంగా మిగిలింది. ప్రస్తుతం అన్ని కులాలు అనువంశిక కులాలే
ఇక్కడ ఏ కులాన్ని తక్కువగా ఎక్కువగా చూసే ప్రయత్నం లేకుండానే ఆయా కులాల వారు ఆయా కులాల వ్యవస్థలను వంశాలను నిర్మించుకుంటూ వస్తున్నారు. దీంట్లో ఎవరిది ఒత్తిడి ప్రయత్నం లేకుండానే ఒక వివాహ వ్యవస్థలో ప్రధాన శాస్త్రీయ జన్యు శాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తూ వారి వారి కులాలను అనువంశిక కులాలుగా మార్చుకుంటున్నారు. జన్యు శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి కులం ఒక వ్యవస్థను ఒక వంశాన్ని కలిగి ఉంది. దాని ప్రకారమే సంతతి కొనసాగుతుంది. అందులో మంచి లక్షణాలు చెడు లక్షణాలు ఏవైనా ఆ వంశం లోని జన్యుల ప్రకారమే జరుగుతుందన్న ది నిజం. రంగు రూపం ప్రతిభ సౌష్టవం గుణం మొదలగు లక్షణాలు కులంలోని వంశవృక్షం ఆధారంగానే ఏర్పడుతాయని జనుశాస్త్రం చెబుతుంది. కనుక కులము ఒక అనువంశిక లక్షణంగా శాస్త్రీయంగా ఒప్పుకుంటున్నాం. ఇదంతా శాస్త్రీయంగా జరిగినదే కానీ కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఒకరి వంశవృక్షం మరొకరి వంశవృక్షం మారడం వలన రెండు కులాలు ఆ తర్వాత రెండు కులాల వారు మరో కులం వారిని వివాహమాడితే, మరో వంశవృక్షం ఇలా ఒక తరం రెండు తరాల వాళ్లు కులాంతర వివాహాలు చేసుకుంటే మొత్తం అనువంశిక కులం మారుతుంది. కుల వ్యవస్థ కుల అనువంశిక లక్షణాలు మారుతాయి. అప్పుడు అనువంశిక కులం అన్ని కులాల అనువంశిక లక్షణాలను కలిగి ఉండడమే కాక ఆ అన్ని కులాలను అవుతాయి. అంటే ఆ అన్ని కులాల జన్యు లక్షణాలే కాక ఆ జన్యు కులాలు కూడా జీవించి ఉంటాయి అని అర్థం. ఓకే వంశవృక్షంలోని వ్యక్తులను వివాహం చేసుకుంటేనే అనువంశిక కులమవుతుంది. కానీ వంశవృక్షంలో లేని మరో వృక్షంలోని వ్యక్తులను వివాహమాడితే వచ్చే సంతతికి అనువంశిక కులం వర్తించదని జనుశాస్త్రం చెబుతుంది. అంటే ఒక వంశవృక్షంలోని లక్షణాలు అన్ని ఒకసారి కాకపోయినా మరొకసారి బహిర్గత లక్షణాలు బయటపడతాయి లేదా అంతర్గత లక్షణాలుగా జన్యుల్లో నిక్షిప్తమై ఉంటాయి. కనుక అనువంశిక కులం కావాలంటే వంశవృక్షంలోని మరో వంశవృక్షాన్ని వివాహమాడితే తర్వాతి తరాల్లో అవి ఒకే ఒక వంశవృక్షంగా మారుతూ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఆ వంశవృక్షంలా జన్యు లక్షణాలన్నీ కూడా వంశవృక్షకులంలో నిక్షిప్తమై ఉండి కొన్నిసార్లు అంతర్గతం నేనుగా మరికొన్నిసార్లు బహిర్గత లక్షణాలుగా సంతతిలో బయటపడుతూ కొనసాగుతూ ఉంటాయి. ఒక్క విషయం మాత్రం నిజం అన్ని వంశవృక్షాల లక్షణాలు మాత్రం తర్వాతి తరాలకు జన్యువుల్లో నిక్షిప్తమై కొనసాగుతూనే ఉంటాయి. ఇందులో ఏ ఒక్క లక్షణం వృధా కాదు. డిలీట్ కాదు కానీ అంతర్గత బహిర్గత లక్షణాలుగా తర్వాతి తరాల్లో వ్యక్తమౌతూ ఉంటాయి. అంటే ఎన్ని వంశవృక్షం లు కలిసిన అందులో ఉపయుక్తమైన లక్షణాలన్నీ ప్రకృతి తర్వాతి తరాలకు అందిస్తూనే ఉంటుంది. అనుపయుక్త లక్షణాలను విలుప్తం చేస్తుంది ప్రకృతి. అవసరమైన సహజమైన ఉపయోగకరమైన పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే లక్షణాలన్ని కూడా జన్యులలో నిక్షిప్తమై తర్వాతి తరాలకు వారసత్వంగా అందిస్తుంది ప్రకృతి. ఈ రకంగా కొన్ని వంశవృక్షాలు కలిసి ఏర్పడ్డ కులం తప్పకుండా ఆ అన్ని వంశవృక్షాల అనువంశిక కులం అవుతుంది. ఇప్పుడు ఉన్న కులాలన్నీ వేల సంవత్సరాలుగా ఎన్నో వంశవృక్షం లను కలుపుకొని ఏర్పడ్డ కులాలే కనుక ఇవి అనువంశిక కులాలుగానే పరిశోధనలు చెబుతున్నాయి. అనువంశిక కులాలపై పరిశోధనలు ఎంతో అవసరం. కులాంతర వివాహాల వల్ల అనువంశిక కులం క్రమం తప్పుతుంది. దీనివల్ల లాభాలు నష్టాలు ఎలా ఉన్నా అనువంశికంగా ఒక క్రమం తప్పుతాము.. ఇది కుల వ్యవస్థకు వ్యతిరేకం కానీ జన్మిశాస్త్ర ప్రకారం మిశ్రమ కులాల వల్ల వంశవృక్షం బలంగా మారుతుందని శాస్త్రం చెప్తుంది. దీనిపై పరిశోధనలు చాలా అవసరం. ఎందుకంటే కుల వ్యవస్థను కూల్చాలన్న కుల వ్యవస్థను బలపరచాలన్న శాస్త్రీయ పరిశోధనల అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా కులం అనువంశికం అనువంశిక కులం.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు