సుప్రభాత కవిత ; బృంద
చీకటికి సెలవిస్తూ...
కిరణాల హంగామా..

ఏ చిన్ని మూలనీ
వదలకుండా  దూరిపోగల
సామర్థ్యం .

అణువణువూ చైతన్యం
నింపుతూ చేసే స్నేహం.

నిదురమబ్బుల్ని సూదిలా
గుచ్చి మేల్కొలిపే  ప్రేమ.

తూరుపు వాకిటినుండీ
వాలుగా కిరణాల ఝరి
అవనిని తాకి  అడిగే కుశలం.

తీగచాటున రాగమాలికలు
పాడుతున్న పువ్వులను 
వెదికి ఇచ్చే అభినందనం.

నేనొచ్చేసినా లేవరేంటని
ముద్దుగా విసుక్కునే అభిమానం

పరమాత్ముడు మనపై
కురిపించే అనుగ్రహం....

గమనమే గమ్యమైన
మానవజీవితానికి
కొత్త అవకాశాలు ఇస్తూ
కోటి కోరికల మూట తెచ్చే
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు