సమయము లేదు!!?-ప్రతాప్ కౌటిళ్యా
త్రాగాల్సిన నీటిని
త్రాగడం ఆపేసి
వాతావరణ పీడనాన్ని
త్రాగుతున్నాం!!!?

ముయ్యాల్సిన కళ్ళను
మూసేసి
నలుపు తెలుపులంటున్నాం
తలుపులు తెరిస్తేనే కదా
అసలు రంగు బయటపడేది!!!?

ఉండాల్సిందంతా
బయటనే ఉంది
అది కనిపెట్టాల్సింది
లోపల ఉంటేనే కదా!!!?

పదార్థంలోకెళ్లే
ప్రతిపదార్థము పుట్టింది
అర్థం చేసుకుంటేనే కదా
యదార్థం తెలిసేది!!?

అవసరానికే అన్ని
పుట్టలేదు
లక్షణం ధర్మం
అవసరమేమీ కాదు!!?

మోస్తే బరువు తెలుస్తుంది
కానీ
మోసం తెలియదు కదా!!?

ఉన్నదంతా
నీలోనే ఉంది
లేనిది నువ్వు మాత్రమే!!?

పంచభూతాలు కనిపెట్టిన ప్రాణం
కాలం కనిపెట్టలేకపోయింది!!
కానీ
పంచభూతాలు కాలం కలిసి కనీ-పెట్టావీ
అంతా కాకతాళీయం మాత్రమే
ఏ మంత్రము ఏ యంత్రాంగము ఏ యంత్రము అంతకు ముందు లేదు!!?

ఇంకా
అవసరం కోసం పని చేస్తున్నాం
సమయం లేదు
సంతోషం కోసం పనిచేద్దాం!!?

మనమిద్దరం
మాంసపు ముద్దలం కాదు
పదార్థ ముద్దుబిడ్డలం!!!

యుద్ధానికి సమయం లేదు
సంతోషం కోసం పనిచేద్దాం!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు