సుప్రభాత కవిత ; -బృంద
ఆనందం అనిపించింది
చేసేయాలి..
అసలైన  సంతోషం
మనసుకు తెలుసు.

చిన్న విషయాలు ఇచ్చే
సంతోషం విలువ 
చాలా ఎక్కువ.

మనసును ఉత్సాహపరిచే
విషయాలు  చాలా
చిన్నవి....

ఆవుకు గంగడోలు నిమరడం

కోయిల పాడుతుంటే
బదులు ఇవ్వడం....

వర్షంలో తడవడం...

పాపాయిలను పలకరించడం

తువ్వాయి వెంట 
పరుగులు తీయడం..

లేత చింతకాయలు
తినడం...

పచ్చని  ప్రకృతి  ని
కళ్ళు నిండేలా చూడ్డం...

పెంచుకున్న మొక్కలో
విరిసిన మొదట గులాబి

పరుగులు తీసే అలలను
ప్రశాంతంగా చూడడం..

పాటలు పాడ్డం....
పాటలు వినడం....

వీటికి డబ్బు అక్కరలేదు...
ఇలా  ఆనందాలు పోగేసుకునే
మనసు ఉంటే చాలు.

జీవితం వెంట పరుగులు
పెడితే.....బ్రతుకు

పరుగులతో పాటు
ఆనందాలూ పోగేసుకుంటే
జీవితం....

ఒకో....మనసు...
ఒకో విషయానికి
ఒకో  రకంగా స్పందిస్తుంది.

ముందు మనకు సంతోషం 
ఇచ్చే విషయం కనుక్కుంటే
చాలు..

కొంచెం సమయం కేటాయిస్తే
చాలు.

మనసు మళ్లీ  మళ్లీ  ఉత్తేజితం
అవుతూనే వుంటుంది ..

సూర్యోదయం చూడ్డం కూడా
ఒక మంచి అనుభూతి.
ప్రయత్నించండి...

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు