సుప్రభాత కవిత ; - బృంద

వెలుతురు పెరుగుతూ వస్తుంటే
చీకటి బెదురుతూ పారిపోతోంది.

మిత్రుడి అనుగ్రహమంతా
కిరణాలతో ఇలకు చేరుతోంది

జగద్రక్షకుడి ప్రేమను ...కొమ్మ 
రెమ్మలకు వివరించి చెబుతోంది.

చెరువులోని చివరి నీటి బిందువుకీ
వెచ్చదనంలా అనుగ్రహం అందుతోంది.

కఠినమైన  రాతికీ  వెలుగుతో
మెరుపొచ్చి  ప్రణమిల్లుతోంది.

నింగిని మబ్బులు మిత్రుని
రంగుల  దారులతో
స్వాగతిస్తోంది.

కొండల నడుమ  బింబం
గగనపు నుదుట బొట్టై వెలుగుతోంది

అవని కి జీవనమిస్తూ
అంతర్యామి ఆగమనం

మనలోమార్పుకి మరో అవకాశం
ఇచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు