ఓ కవీ!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పాటకు నువ్వే మూలం
ప్రాసకు పడ్డావు కష్టం
పోశావు అక్షరాలకు ప్రాణం
పంచేవు చెవులకు శ్రావ్యం

వచనకవితకు నువ్వు మూలం
చేశావు అద్భుత పదప్రయోగం
పుట్టించేవు ఉన్నత భావం
తెలిపేవు చక్కని విషయం

పద్యానికి నువు మూలం
నీయతిప్రాసలు అద్భుతం
గణాల కూర్పు బహుఘనం
చేశావు కవనం చందోబద్ధం

చేశావు అక్షరాల సేద్యం
వాడేవు హలంలా నీకలం
చేసేవు సాహితిని సస్యశ్యామలం
సాధించేవు కవితాపంటల ఫలసాయం

చేసేవు సాహిత్యలోకాన్ని సుభిక్షం
నిలిచేవు జనులమదులలో కలకాలం
తొలగించేవు ప్రజల అఙ్ఞానాంధకారం
ఇచ్చేవు పాఠకులకు శాశ్వతానందం

కవులకు నీరాజనం
కవితలకు ఆహ్వానం
కలాలకు ధన్యవాదం
కవనానికి పట్టాభిషేకం

కవితలను వల్లెవేస్తాం
కవులను తలచుకుంటాం
సాహితిని గౌరవిస్తాం
సరస్వతికి పూజలుచేస్తాం


కామెంట్‌లు