దరహాసం... పరిహాసం
******
దరహాసం,పరిహాసం ..రెండూ హాసాలే
ఆనందానికీ, ఆత్మీయతా పూర్వకమైన పలకరింపుకు చిహ్నం దరహాసం.
ఇతరులను అవమానించేలా గానీ తక్కువ చేసిగానీ మనసును,మనిషినీ నొప్పించేది పరిహాసం.
విడివిడనట్టు, పళ్ళు కనబడకుండా ,శబ్ధం రాకుండా, కళ్ళను కూడా కలుపుకుని చేసే మందహాసం.. స్నేహ హస్తం అందించేలా, భరోసా కలిగించేలా, స్వచ్చమైన మనసుకు,ప్రశాంతతకు ప్రతీకగా ఎదుటివారి మనసును దోచే విధంగా ఉంటుంది.
వెటకారంగా పెదవి విరుస్తూ , ఎదుటి వారి శారీరక, మానసిక లక్షణాలను, గెలుపు ఓటములను మాటలతో విమర్శించకుండా, ఆ భావనలన్నీ పెదవులపై ఒలికిస్తూ ...ఎవరూ ఇష్టపడని, ఆమోదయోగ్యం కాని నవ్వే పరిహాసం.
ఈ పరిహాసం మహా ప్రమాదకరం. ఎదుటివారిని ఎంతో గాయపరుస్తుంది. ఆత్మ న్యూనతా భావాన్ని, మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
పెదవులు చిందించే హాసం ఎల్లప్పుడూ ఎదుటి హృదయాలను గెలుచుకునేదిగా ఉండాలి కానీ మనసుపై చేసే నిశ్శబ్ద దాడిగా ఉండకూడదు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి