సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ప్రయాణం.. ప్రమాదం..
  *******
ప్రయాణం ఎల్లప్పుడూ ప్రమోదం కాదు.
అప్పుడప్పుడూ జీవితం అంటే ఏమిటో తెలిసేలా, మనం పూర్తి చేయాల్సిన పనులు ఎందుకు ఆలస్యం చేయకూడదో అర్థమయ్యేలా, అనుభవాల పాఠాలను నేర్పేందుకు కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి .
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని విధంగా హఠాత్తుగా జీవితం తల్లక్రిందులు అయ్యేలా ప్రమాదాలు జరగొచ్చు.
అలాంటప్పుడే మనలోని నిబ్బరత్వం , వాటిని ఎదుర్కొనే ధైర్యం బయటపడుతుంది.
చేసిన ప్రయాణంలో జరిగిన ప్రమాదం నుండి, ప్రాణాపాయం లేకుండా  బయటపడ్డామంటే మనం చేయాల్సిన మంచి పనులు ఇంకా ఈ లోకంలో మిగిలి ఉన్నాయని అనుకుంటే అంత కంటే ఆనందం ఇంకోటి ఉండదు కదా!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు