జలుబు;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 చల్లచల్లగా గొంతు వెంట జారే నీటిని సైతం 
గోరువెచ్చగా మారుస్తుంది జలుబు,
పదేపదే వచ్చే తుమ్ములై 
వెక్కిరిస్తూ, మనను వేధిస్తుంది జలుబు,
తలపులన్ని భారమై
తలపోటును మనకు తెప్పిస్తుంది జలుబు,
కమ్మని నాలుకకు కషాయం రుచిని, 
చూపిస్తుంది జలుబు,
తన వునికిని చాటుతూ నిద్రను సైతం 
మరిపిస్తుంది జలుబు,
వేడివేడిగా ఏదో ఒకటి తినలన్న ఆశను,
మనలో కలిగిస్తుంది జలుబు,
మొండిగా వీడనంటూ
మెడికల్ షాపుల దిశగా
మనను నడిపిస్తుంది జలుబు,
ఎంతటి ఘనులైనా సరే,
తన ముందు అందరూ సమానమే అన్న నీతిని
మనకు వివరిస్తుంది జలుబు,
నవ్వుతూ మళ్ళీ వస్తానంటూ 
మన దారికి మనను మళ్లిస్తుంది జలుబు...


కామెంట్‌లు