గాంధీ తాత; -డా.. కందేపి రాణీప్రసాద్.
గాంధీతాతకు జేజేలు
గాంధీ బాటకు జేజేలు

సత్యమునే పలకాలన్నాడు
సహనమునే చూపాలన్నాడు
శాంతంగా బతకాలన్నాడు
సఖ్యంగా మెలగాలన్నాడు

హింసా మార్గం వద్దన్నాడు
అహింసయే ముద్దన్నాడు
అన్ని మతాలు ఒక్కటేనన్నాడు
అందరూ బాగుండాలన్నాడు

స్వతంత్రం కావాలన్నాడు
సమభావం ఉండాలన్నాడు
సోదరుల్లా కలసిపొమ్మన్నాడు
శత్రువుల్ని ప్రేమించమన్నాడు

సుహృద్భవంతో మెలగాలన్నాడు
సామరస్యం కలిగుండాలన్నాడు
కోపాన్ని దూరం చేయమన్నాడు
కరుణను అలవరచుకోమన్నాడు

కామెంట్‌లు