మన భూమి; - డా.. కందేపి రాణీప్రసాద్.
మన భూమి భారత భూమి
మన భూమి బంగరు భూమి

మహాభారత రామాయణాలు
వేదగ్రంధాలు వెలసిన భూమి
హరప్పా సింధు మొహంజదారాలలో
నాగరికత వెల్లివిరిసిన భూమి

గంగా యమున సరస్వతి
త్రివేణి సంగమ వేదభూమి
ఎతైన శిఖరాల హిమాలయాలు
మానస సరోవరాల దేవభూమి

అహింస మార్గాన్ని భోదించిన
బుద్దుడు జన్మించిన భూమి
భిన్న సంస్కృతుల సమ్మేళనమే
ఏకత్వమని చాటిచెప్పిన భూమి

ప్రపంచానికి సున్నానుచూపిన
రామానుజం పుట్టిన భూమి
ప్రాచిన వైద్యం ఆయుర్వేదానికి
పేరు గాంచిన ప్రఖ్యాత భూమి

శివాజీ, ఝాన్సీ, భగత్ సింగ్
శూరులను కన్నట్టి త్యాగభూమి
గాంధీజీ, చాచాజీ, నేతాజీ
వీరులను పెంచిన ధన్యభూమి

కర్మభూమి మన భారత భూమి
జన్మభూమి మన భారత భూమి
పుణ్యభూమి మన భారత భూమి
మాతృభూమి మన భారత భూమి

కామెంట్‌లు