యదార్ధ సాహితీప్రతినిధి @కోరాడ నరసింహా రావు.

 చాలా కధలలో... విషయం కంటే, విధానానికే ప్రాధాన్యత కనిపిస్తుంది !ఉపమాన - ఉపమేయ ప్రతీకాత్మక వర్ణనలే 
రచయిత ప్రతిభను ప్రకటిస్తూ కనిపిస్తాయి ! కధలలో అభ్యు దయ కాల్పనికత,వాస్తవానికి కొంత దూరంగా అనిపింప జేస్తాయి !
  రావిశాస్త్రిగారి కధలు వీటికి భిన్నంగా... యదార్ధ సంఘటనలకు సజీవ సాక్ష్య చిత్రాల్లా కనిపిస్తాయి !
వారికధల్లో కల్పనలకు తావు లేదు !
వారిది సామాజికవాదం ! సమాజంలో మనిషి, మనిషి బ్రతుకే ప్రదానం... !!
అతని దృష్టికోణంలో కేవలం వేంకటేశునికే కోట్లు కుమ్మరించే ఆ ఏడుకొండల కన్నా... కోట్లమందికి ఉపాధిని కల్పించే విశాఖకు ఆలంబనగా నిలచిన యారాడకొండేమిన్న.. అంటారు
రావిశాస్త్రిగారు !
"సమాజానికిహితవునుచేకూర్చగలిగేదే...సాహిత్యం "  !
అనేదానికి యదార్ధమైన సాహితీ ప్రతినిధి రావిశాస్త్రి గారు !
కామెంట్‌లు