సంగీతము;- --గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.
గొప్పదోయి సంగీతం
పరవశించు ప్రతి హృదయం
సృష్టిలోని ప్రతి జీవి
ఇష్టపడును నిరంతరం

రాళ్లు కూడా కరుగును
రాగాలకు నిజమోయి!
ఏడ్పు సహితం మానును
సంగీతానికి పాపాయి!

సంగీతమయం జగము
అక్షరాల వాస్తవము
నడిపించును సంగీతము
విన్పించును సునాదము

పండితుడు,పామరుడూ
ఎవరికైనా ప్రాణము
కదిలించే సంగీతము
అదేకదా స్వర్గతుల్యము

లోకమే దాసోహం
సు సంగీతం కోసం
బ్రతుకులో మధుమాసం
దేవుని వరప్రసాదం

స్వర కర్తుల జీవితం
సంగీతానికి అంకితం
పంచుతుంది పరవశం
చేసుకొనును కైవసం


కామెంట్‌లు