ఎ.పి.టి.ఎఫ్.పోస్టుకార్డు ఉద్యమం

 శ్రీకాళహస్తి:
విద్యారంగ,ఉపాధ్యాయ సమస్యలపై
ఎ.పి.టి.ఎఫ్ వంద రోజులు పోరు బాట
కార్యక్రమంలో భాగంగా  ప్రధాన తంతి తపాలా కార్యాలయ ఆవరణలో
ముఖ్యమంత్రి గారికి పోస్టు కార్డు ద్వారా పరిష్కరించాలనికోరారు.ఈసంధర్భంగా
తొట్టంబేడు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కయ్యూరు బాల సుబ్రమణ్యం, చంద్రశేఖర్ మాట్లాడుతూ
సి.పి.ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్
కొనసాగించాలని , పాఠశాల విలీన 
ప్రక్రియను ఆపాలని అన్నారు.జిల్లా అధ్యక్షుడు, మరియు గౌరవ అధ్యక్షుడు
మురళీకృష్ణ, సుధాకర్ మాట్లాడుతూ
జి.ఓ.నెంబర్ 117 రద్దు చేయాలని,
పాఠశాలలో రెండు సమాంతర మాద్య
మాలను కొనసాగించాలని ఖాళీగా
ఉన్న ఉపాధ్యాయు పోస్టులను భర్తీ
చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా కౌన్సిలర్స్ క్రిష్ణయ్య,మునిరాజా,
సుమలత, నాయకులు శ్రీనివాసులు,
ఈశ్వరయ్య, గోపాల్ ,రామదాసు,వెంక
టయ్య పాల్గొన్నారు.
కామెంట్‌లు