రాఖీపూర్ణిమ!!- ప్రతాప్ కౌటిళ్యా
మందిరంలో సుగంధ పరిమళం
హృదయ పందిరిని అల్లుకున్న
మల్లెతీగ మా చెల్లి!!

తేనెల మాటలతోటలో
ఊపిరి ఊయల ఆటలో
వేణువు పలికిన పాటలో
పండు వెన్నెల
మా తెలుగింటి అమ్మాయి మా చెల్లి!!

అమ్మానాన్న ల ఆనవాళ్లు
అక్క అన్నల రూపాలు
బడిపంతుల్లా ఓనమాలు
గుడి పంతుల్లా ఓం నమః లు

మా తెలుగింటి అమ్మాయి మా చెల్లి

పుట్టింటికి పట్టపు రాణి
మెట్టినింటికి గృహలక్ష్మి
చుట్టాలకు కంటి చూపు
కొంటె పిల్లలకు కొంటె చూపు

మా తెలుగింటి అమ్మాయి మా చెల్లి!!

చిరునవ్వుల పువ్వులు
దేవుడిచ్చిన వరాలు
పదహారణాల అన్నా చెల్లెళ్ళు
జన్మ జన్మల బంధాలు!!!

మా తెలుగింటి అమ్మాయి మా చెల్లి!

చెల్లి శశికళకు అంకితం!!
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు